
ఒకప్పుడు ఇండస్ట్రీలోలవర్ బాయ్. విపరీతమైన అమ్మాయిల ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్. చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగి.. అద్భుతమైన నటనతో తనదైన ముద్రవేశాడు. కెరీర్ తొలినాళ్లల్లోనే ఒకటి రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అతడి జీవితం మలుపు తిప్పింది. తెలుగు, తమిళం భాషలలో వరుస అవకాశాలు అందుకుంటూ హీరోగా దూసుకుపోతాడని అనుకున్నారు. కానీ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే జరిగిన ఓ ప్రమాదంతో సినిమాలకు దూరమయ్యాడు. దాదాపు 13 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఈ స్టార్ హీరో.. రీఎంట్రీలో మాత్రం మాస్ అవతారంతో మెప్పిస్తున్నారు. అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు మాత్రం సిల్వర్ స్క్రీన్ పై పవర్ ఫుల్ స్టైలీష్ విలన్. ఇంతకీ ఎవరో తెలుసా.. అరవింద్ స్వామి.
అరవింద్ స్వామి.. ఈ పేరు క్రేజ్ ఇప్పటితరానికి తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు అతడి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 1991లో మణిరత్నం దర్శకత్వం వహించిన రజనీకాంత్, మమ్ముట్టి కలిసి నటించిన దళపతి చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. మొదటి సినిమాతోనే నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్ పాత్రకు వ్యతిరేకమైన పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు. ఆ తర్వాత ఏడాది మణిరత్నం రూపొందించిన రోజా సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ దగ్గర సంచలనం. ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్స్. ఆ తర్వాత బాంబే, ఇందిర, మిస్ సార కనవు వంటి చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకుని తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోనే తనదైన ముద్ర వేశారు.
ఇవి కూడా చదవండి: Damarukam movie: ఢమరుకం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్..
Shopping Mall : షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడేం చేస్తుందంటే..
అదే సమయంలో సాత్ రంగ్ కే సప్నే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. 30 ఏళ్ల వయసులోనే అనుకోకుండా ఓ ప్రమాదంతో సినిమాలకు దూరమయ్యారు. ఆ ప్రమాదంలో అరవింద్ స్వామి కాలుకు ప్రమాదం జరగడంతో దాదాపు 5 సంవత్సరాలు చికిత్స తీసుకున్నాడు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటున్న సమయంలోనే వ్యాపారంపై దృష్టి పెట్టాడు. టాలెంట్ మాగ్జిమమ్ అనే కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ కంపెనీ విలువ రూ.3,300 కోట్లు. అయితే దాదాపు 13 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అరవింద్ స్వామి.. 2013లో మణిరత్నం తెరకెక్కించిన కడల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి:
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!
Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..