Cinema: ఒక్క ముద్దు సీన్‌కు 47 సార్లు రీటేకులు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఒకటి ఉంది. ఇప్పటికీ అడియన్స్ హృదయాల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ హిట్ మూవీ అది. అంతేకాదు.. ఈ సినిమాలో సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ? ఇప్పటికీ ఆ సినిమాలోని సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాియ.

Cinema: ఒక్క ముద్దు సీన్‌కు 47 సార్లు రీటేకులు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Raja Hindustani

Updated on: Jul 23, 2025 | 10:29 AM

సాధారణంగా ఒక్కొ సినిమాలో కొన్ని సీన్స్ షూట్ చేయడానికి చాలా టైమ్ పడుతుంది. అయితే సీన్ బాగుండాలని చాలాసార్లు రీటేక్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం దాదాపు 29 సంవత్సరాల క్రితం బాక్సాఫీస్ షేక్ చేసింది. అందులో ఓ సూపర్ స్టార్ నటించారు. అంతేకాదు.. అప్పట్లో ఒక్క ముద్దు సీన్ కోసం 47 సార్లు రీటేక్ చేశారట. అలాంటి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బారీ విజయాన్ని అందుకుంది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా ఏంటో తెలుసా.. ? అదే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ రాజా హిందుస్తానీ. 1996 నవంబర్ 15న విడుదలైన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలోని పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ముఖ్యంగా ‘పరదేశి పరదేశి’ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ధర్మేష్ దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై 29 సంవత్సరాలు అయింది. రాజా హిందుస్తానీ రూ. 6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. రూ.78 కోట్లు వసూలు చేసింది. 1996లో ఒక అద్భుతమైన విజయం. అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రానికి యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి: Damarukam movie: ఢమరుకం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్..

ఇవి కూడా చదవండి

Shopping Mall : షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడేం చేస్తుందంటే..

అయితే ఈ సినిమాలో అమీర్ ఖాన్, కరిష్మా కపూర్ మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుంది. ఈ సన్నివేశాన్ని ఊటిలో చిత్రీకరించారు. ఊటీలో అధికంగా చలి ఉండడంతో షూట్ సమయంలో నటీనటులు ఎంతో ఇబ్బందిపడ్డారట. ఆ సమయంలో ఒక్క లిప్ లాక్ సీన్ చేయడానికి 47 రీటేకులు తీసుకున్నారట. టాక్సీ డ్రైవర్, ధనవంతురాలైన స్త్రీ మధ్య ప్రేమకథగా ఈ సినిమాను రూపొందించారు. ప్రస్తుతం ఈ మూవీ జియో సినిమాలో అందుబాటులో ఉంది.

Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..