
సినీరంగంలో నిత్యం ఏదోక కొత్త సినిమా అడియన్స్ ముందుకు వస్తుంటాయి. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జానర్ చిత్రాలు చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తుండగా.. మేకర్స్ సైతం ఈ జానర్ సినిమాలు రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈమధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఒక్కో సినిమాకు కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నారు. కానీ కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగా.. మరికొన్ని మాత్రం అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. ఇక మరికొన్ని సినిమాలు మాత్రం ఎప్పుడు థియేటర్లలోకి వచ్చాయో కూడా జనాలకు తెలియదు. కోట్లలో నిర్మించిన చిత్రాలు చివరకు లక్షలు కూడా రాబట్టలేకపోయాయి. అలాంటి వాటిలో ఈ సినిమా ఒకటి. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ మూవీ. దాని బడ్జెట్ లో ఒక్క శాతం కూడా సంపాదించలేకపోయింది. ఆ సినిమా మరెదో కాదు.. ‘ది లేడీ కిల్లర్’.
అజయ్ బహల్ రూపొందించిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ది లేడీ కిల్లర్. 2023లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమాలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.45 కోట్ల బడ్జె్ట్ తో టీ సిరీస్ బ్యానర్ నిర్మించింది. అయితే ఈ మూవీ తొలి రోజున కేవలం 293 టికెట్స్ మాత్రమే అమ్ముడయ్యాయని మీకు తెలుసా.. ?ఈ సినిమా కేవలం రూ.38 వేలు మాత్రమే వసూళ్లు రాబట్టింది. ఇక మొత్తం కలెక్షన్స్ గురించి చెప్పాలంటే రూ.60 వేలు కలెక్షన్స్ వసూలు చేసింది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద అట్టర్ ప్లాప్ మూవీ.
థియేటర్లలో సినిమా విడుదలైన తర్వాత, నిర్మాతలు దానిని ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ నెట్‌ఫ్లిక్స్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత ఏ ఓటీటీ ప్లాట్ ఫారమ్ కూడా ఈ సినిమాను కొనుగోలు చేయలేకపోయింది. దీంతో ఈ సినిమాను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్.
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..