AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. వెంకటేశ్‏తో బ్లాక్ బస్టర్ హిట్టు.. కట్ చేస్తే.. వ్యభిచార కేసులో ఇరుక్కుని కెరీర్ నాశనం..

సినీరంగంలో నటిగా ఓ వెలుగు వెలగాలని ఎన్నో కలలతో అడుగుపెడుతుంటారు చాలా మంది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొని, అవమానాలు భరించి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు. అయితే కొందరు తారలు మాత్రం అనుహ్యంగా తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే.

Actress: స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. వెంకటేశ్‏తో బ్లాక్ బస్టర్ హిట్టు.. కట్ చేస్తే.. వ్యభిచార కేసులో ఇరుక్కుని కెరీర్ నాశనం..
Vineetha
Rajitha Chanti
|

Updated on: May 01, 2026 | 3:05 PM

Share

సాధారణంగా సినీరంగంలో ఒక్క సినిమాతోనే పాపులర్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని సినీరంగంలో ఓ వెలుగు వెలుగుతారు అనుకుంటే.. అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుని కెరీర్ కోల్పోయిన తాలా చాలా మంది ఉన్నారు. ఇందులో మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ వినీత ఒకరు. 1990ల్లో తెలుగు, తమిళ సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోలతో ఛాన్సులు అందుకుంది. స్టార్ హీరోయిన్ కావాల్సింది.. అనుకోకుండా కెరీర్ క్లోజ్ అయ్యింది. ఇంతకీ వినీత అంటే గుర్తుపట్టారా.. ? తనేనండి మనీషా.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‏తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..

విక్టరీ వెంకటేశ్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాతో తెలుగులో పాపులర్ అయ్యింది. ఇందులో మనీషా పాత్రలో నటించి ఆకట్టుకుంది. వినీత అసలు పేరు లక్ష్మి. 1993లో వచ్చిన చిన్న జమీన్ అనే సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ మరుసటి ఏడాది అల్లుడు పూరు అమ్మాయి జోరు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో వరుస చిత్రాల్లో నటించింది. కెరీర్ ప్రారంభంలోనే మోహన్ లాల్, విజయకాంత్, కార్తీక్, జయరామ్, శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. సౌత్ ఇండస్ట్రీలో మొత్తం 70 సినిమాల్లో నటించింది.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..

Vineetha Movies

Vineetha Movies

కానీ ఆమెకు పేరు తెచ్చి పెట్టిన సినిమా మాత్రం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా. ఆ తర్వాత లేడీస్ డాక్టర్, వారెవ్వా మొగుడా వంటి హిట్స్ చేసింది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2000లో ప్రారంభంలో వ్యభిచారానికి సంబంధించిన ఆరోపణలపై ఆమెను అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె విడుదలైనప్పటికీ కెరీర్ మాత్రం పూర్తిగా దెబ్బతింది. అవకాశాలు తగ్గిపోయాయి. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. కావాలని ఎవరో తనపై రూమర్స్ క్రియేట్ చేశారని వినీత వాదించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తర్వాత వినీత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. ఇప్పుడు ఆమె సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..

Vineetha Latest

Vineetha Latest

ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

Follow Us