AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్నానం చేసేందుకు నదిలో దిగిన స్థానికులు.. మెరుస్తూ కనిపించింది ఏంటా అని చూడగా..

కృష్ణా నదిలో స్థానికులకు కనిపించిన పంచలోహ శ్రీరామ విగ్రహం సంచలనం సృష్టించింది. గుడిమెట్ల వద్ద బయటపడిన ఈ శిల్పం శతాబ్దాల నాటి ఆలయానికి చెందినదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు దీన్ని దైవ సంకేతంగా భావిస్తుండగా, అధికారులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని పురావస్తు శాఖతో దాని చరిత్రను వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభించారు.

స్నానం చేసేందుకు నదిలో దిగిన స్థానికులు.. మెరుస్తూ కనిపించింది ఏంటా అని చూడగా..
Lord Rama Idol
M Sivakumar
| Edited By: |

Updated on: May 01, 2026 | 3:06 PM

Share

కృష్ణా నది ఎన్నో నాగరికతలకు, ఎన్నో గాథలకు సాక్షిగా నిలిచిన పవిత్ర ప్రవాహం. అలాంటి నదిలో ఒక అద్భుతం వెలుగుచూసింది .సాధారణంగా కనిపించే ఇసుక తిన్నెల మధ్య.. కాలం దాచిన ఒక చారిత్రక శిల్పం బయటపడింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల కృష్ణా నదిలో కొందరు స్థానికులు స్నానం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నీళ్లలో ఏదో మెరుస్తూ కనిపించింది. ఏంటా అని పైకి తీసి చూడాగా అది ఒక పంచలోహ విగ్రహం.. అది కూడా ఆ రామయ్య తండ్రిది. సుమారు ఒకటిన్నర అడుగుల ఎత్తులో ఉన్న ఈ విగ్రహం అద్భుతమైన శిల్పకళతో తీర్చిదిద్దబడి ఉంది. విల్లు, బాణాలతో నిలబడి ఉన్న శ్రీరాముడి రూపం.. ఎంతో స్పష్టంగా కమనీయంగా ఉంది. పంచలోహంతో తయారైన ఈ విగ్రహం మీద కాల ప్రవాహానికి నిదర్శనంగా స్వల్ప ధ్వంసం కనిపిస్తున్నప్పటికీ దాని అందం మాత్రం ఏమాత్రం తగ్గలేదు.

ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో.. భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. ఇది దైవ సంకేతం అంటూ కొందరు భావిస్తుంటే.. మరికొందరు ఇది శతాబ్దాల నాటి ఆలయానికి చెందిన విగ్రహం కావచ్చని అంచనా వేస్తున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. అధికారులు అక్కడికి చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పురావస్తు శాఖకు సమాచారం అందించి.. దాని అసలు చరిత్ర, వయస్సు తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. కృష్ణా నది ఒడిలో దాగి ఉన్న ఈ పంచలోహ శ్రీరామ విగ్రహం.. గతం చెప్పే మౌన సాక్షిగా నిలిచింది. ఇది కేవలం ఒక విగ్రహం మాత్రమే కాదు.. మన సంస్కృతి, విశ్వాసాలకు ప్రతీక. ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది.. ఎంత కాలంగా నదిలో దాగి ఉంది అన్న ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంమైంది. భక్తులు మాత్రం ఇదో అధ్భుత ఘటన అని చెబుతూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రైతుకు పొలంలోని గడ్డిలో కనిపించిన గూడు.. ఏమున్నాయా అని చూడగా.. 

Follow Us
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కొన్ని గంటల్లోనే పెళ్లి.. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
ఈ చిన్న పరికరం ఉపయోగిస్తే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు వస్తుందా
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
జూలై 3 రాశిఫలాలు: ఈ రాశులకు ఉద్యోగంలో ప్రమోషన్, వారికి ధనలాభం..
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం