AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్.. ఎండల నుంచి రిలీఫ్.. వర్షాలపై వాతావరణశాఖ అలర్ట్..

ఏపీ, తెలంగాణలో రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వానలు కురవనున్నాయి. దీంతో ఎండాకాలంలో ఇది చల్లని కబురుగా చెప్పవచ్చు.

Weather Report: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూల్ న్యూస్.. ఎండల నుంచి రిలీఫ్.. వర్షాలపై వాతావరణశాఖ అలర్ట్..
Rains In Telangana And Andhra Pradesh
Venkatrao Lella
|

Updated on: May 01, 2026 | 2:53 PM

Share

నిన్నటి దక్షిణ ఒడిశా నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి/ గాలులు అంతరాయం కొనసాగుతూ ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణశాఖ జారీ చేసింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో ఇవాళ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని హెచ్చరించింది.

ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు

రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని స్పష్టం చేసింది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది. అటు రాయలసీమలో కూడా రాబోయే మూడ్రోజుల పాటు వానలు పడతాయని తెలిపింది.

తెలంగాణకు వర్షసూచన

తెలంగాణలో రాగల మూడ్రోజుల పాటు వానలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక మన్నార్ గల్ఫ్ వరకు కొనసాగిన ద్రోణి/వాయు అస్థిరత ఈరోజు ఉదయం 05:30 గంటలకు దక్షిణ ఒడిస్సా నుండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నారు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడి తదుపరి 08:30 గంటలకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిమీ ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Follow Us