AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : మొత్తం 8 ఎపిసోడ్స్‏.. ఓక్కో సీన్ మెంటలెక్కిస్తుంది.. ఓటీటీలో గత్తరలేపుతున్న సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్, షోస్ ఎంతగా పాపులర్ అవుతున్నాయో చెప్పక్కర్లేదు. రోజు రోజుకీ ఓటీటీలో వచ్చే కంటెంట్ చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక భాషతో సంబంధం లేకుండా థ్రిల్లర్,సస్పెన్స్, హారర్ చిత్రాలు చూసేందుకు ముందుంటున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సిరీస్ మాత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ లో గత్తరలేపుతుంది.

Cinema : మొత్తం 8 ఎపిసోడ్స్‏.. ఓక్కో సీన్ మెంటలెక్కిస్తుంది.. ఓటీటీలో గత్తరలేపుతున్న సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
Matka King
Rajitha Chanti
|

Updated on: May 01, 2026 | 2:37 PM

Share

థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలో ఓటీటీలో నెల రోజుల్లోనే విడుదలవుతున్నాయి. మరోవైపు సరికొత్త కంటెంట్ వెబ్ సిరీస్ దూసుకుపోతున్నాయి. తాజాగా ఓ సిరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సత్తా చాటుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ క్రైమ్ డ్రామా సిరీస్ ఓటీటీని షేక్ చేస్తుంది. ఆ సిరీస్ పేరు మాట్కా కింగ్. బాలీవుడ్ డైరెక్టర్ నాగరాజ్ ముంజులే దర్శకత్వం వహించిన ఈ డ్రామాలో నటుడు విజయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించారు. ఏప్రిల్ 17 నుంచి ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హిందీతోపాటు తెలుగులోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: శ్రీకాంత్‏తో మూవీ తీస్తున్నప్పుడు.. ఆయన ఏదో నాకు ఫేవర్ చేస్తున్నట్లు చెప్పాడు.. జేడీ చక్రవర్తి..

ఈ సిరీస్ ముంబై అండర్ వరల్డ్ జూదం కథతో స్టార్ట్ అవుతుంది. నిజ జీవితం సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కించగా.. ఒక్కో సీన్ మెంటలెక్కిస్తుంది. ప్రస్తుతం ఈసిరీస్ కు IMDBలో 7.3 రేటింగ్ ఉంది. 1960వ కాలం నాటి బొంబాయ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఒకప్పుడు భారతదేశాన్ని వణికించిన పేకాట రారాజు రతన్ ఖత్రీ జీవితం ఆధారంగా ఈ సిరీస్ రూపొందించారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: అతడు గొప్ప నటుడు.. నా జీవితంలో అలాంటి హీరోను చూడలేదు.. నా లైఫ్ పూర్తిగా మార్చేశాడు.. తనికెళ్ల భరణి..

మాట్కా కింగ్ సిరీస్ పూర్తిగా జూదం చుట్టూ తిరుగుతుంది. ఇందులో ప్రతి ఎపిసోడ్ లో వచ్చే ఒక్కో సీన్.. ట్విస్టులు ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తాయి. మిడిల్ క్లాస్ వ్యక్తి నుంచి నగరాన్ని శాసించే మాట్కా కింగ్ స్థాయికి ఎదిగిన తీరును చక్కగా చూపించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Actress : ఎన్టీఆర్, ప్రభాస్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్.. అప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ఎక్కువ మంది చదివినవి : Cinema : కొబ్బరికాయ కుళ్లిపోయిందని ఆగిపోయిన సినిమా.. బాలయ్య, పవన్ ఆ మూవీ చూసుంటేనా.. డైరెక్టర్ కామెంట్స్..

Follow Us