Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..

ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల కంటే తక్కువ బడ్జెట్ సినిమాలే ఎక్కువగా సూపర్ హిట్ అవుతున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా దాదాపు 19 సంవత్సరాల క్రితం విడుదలైంది.

Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..
Mungaru Male Film

Updated on: Aug 19, 2025 | 4:13 PM

దాదాపు 19 ఏళ్ల క్రితం విడుదలైన ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. తక్కువ బడ్జెట్… కానీ థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆ సినిమాలో టాప్ హీరో, హీరోయిన్ లేరు. కానీ దాదాపు 460 రోజులు థియేటర్లలో దూసుకుపోయింది. ఆ సినిమా కంటెంట్ జనాలను తెగ ఆకట్టుకుంటుంది. తక్కువ అమౌంట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాసింది. అదే ముంగారు మలే. ఇది కన్నడలో తెరకెక్కించిన సినిమా. ఈ చిత్రానికి యోగరాజ్ భట్ దర్శకత్వం వహించారు. గణేష్, పూజా గాంధీ ప్రధాన పాత్రలలో నటించారు.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

అలాగే ఈ సినిమా అనంత్ నాగ్ కీలకపాత్ర పోషించారు. 2006లో విడుదలైన ఈసినిమా కేవలం రూ.70 లక్షల బడ్జెట్ నిర్మించారు. అప్పట్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా చాలా చోట్ల స్వర్ణోత్సవాలను జరుపుకుంది. ఆ సమయంలో అత్యధిక వసూల్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా బడ్జెట్ కంటే 100 రెట్లు ఎక్కువ సంపాదించింది. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం థియేటర్లలో నడిచింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

PVR బెంగళూరులో 460 రోజులు నిరంతరం ప్రదర్శింపబడి, మల్టీప్లెక్స్‌లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న తొలి సినిమా ఇది. ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల మార్కును దాటిన తొలి కన్నడ సినిమా ఇది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 75 కోట్లు వసూలు చేసింది.ఇది ఖర్చు కంటే 100 రెట్లు ఎక్కువ. ఇది కర్ణాటకలోనే 57 కోట్లు వసూలు చేసింది.

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..