AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : తండ్రి స్టార్ హీరో.. కూతురు మాత్రం అట్టర్ ప్లాప్ హీరోయిన్.. దెబ్బకు ఇండస్ట్రీకి దూరం..

ప్రస్తుతం సినీతారల వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు తారల కూతుర్లు, కొడుకులు సినిమా ప్రపంచంలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. మరికొందరు సినిమా రంగానికి దూరంగా ఉంటున్నారు. కానీ ఓ స్టార్ హీరో కూతురు మాత్రం సినిమాల్లో రాణించలకేపోయింది. అంతేకాదు అట్టర్ ప్లాప్ హీరోయిన్ ముద్ర వేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress : తండ్రి స్టార్ హీరో.. కూతురు మాత్రం అట్టర్ ప్లాప్ హీరోయిన్.. దెబ్బకు ఇండస్ట్రీకి దూరం..
Teena Ahuja
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2025 | 10:00 PM

Share

సాధారణంగా సినీరంగంలో స్టార్ హీరోహీరోయిన్స్ కూతుర్లు, కొడుకులు నటీనటులుగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందులో కొందరు మాత్రమే సక్సెస్ కాగా.. మరికొందరు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ ముద్దుగుమ్మ సైతం సినిమాలను వదిలేసింది. తండ్రి మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్. తండ్రి బాటలోనే సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆమె.. తక్కువ సమయంలోనే ఫేడ్ ఔట్ అయిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఈ హీరోయిన్ పేరు టీనా అహుజ. బాలీవుడ్ స్టార్ హీరో గోవింద గారాలపట్టి. హిందీలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన హీరో గోవింద, సునిజ అహుజ దంపతుల కుమార్తె. 1988 జూలై 16న టీనా అహుజ జన్మించింది. తండ్రి హీరో కావడంతో చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి పెంచుకుంది.

ఇవి కూడా చదవండి : Serial Actress: సూపర్ సూపరో.. సముద్రం మధ్యలో సీరియల్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. ఫోటోలతో కిక్కెంచిన అమూల్య..

దీంతో హీరోయిన్ కావాలనే కలలు కంది. యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో మెలకువలు నేర్చుకుంది. సెకండ్ హ్యాండ్ హస్బెండ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ధర్మేంద్ర, గ్రిప్పి గ్రేవాల్ ప్రధా పాత్రలలో నటించిన ఈ సినిమా 2015ల విడుదలైంది. కానీ విజయం మాత్రం అందుకోలేదు. ఫస్ట్ మూవీ అట్టర్ ప్లాప్ కావడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. గోవింద కూతురు కావడంతో తనకు అవకాశాలు రాలేదని.. ఆ పేరు కారణంగానే తనకు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోయాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కూడా టీనాకు అంతగా అవకాశాలు రాలేదు.

ఇవి కూడా చదవండి : Actress: ఒక్క సినిమా చేయలేదు.. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకం..

దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమైన టీనా.. ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ (IITC) నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తర్వాత కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి యాక్టింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకుంది. అయినప్పటికీ హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో సినిమా రంగాన్ని వదిలేసింది. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ గా మారింది. ఫ్యాషన్, వ్యాపార రంగాల్లో దూసుకుపోతుంది టీనా.

View this post on Instagram

A post shared by Tina Ahuja🧸 (@tina.ahuja)

ఇవి కూడా చదవండి : Cinema : ఏం ట్విస్టులు రా బాబూ.. దెబ్బకు మైండ్ బ్లాక్.. సైకలాజికల్ హారర్ సినిమా.. ఒంటరిగా చూడలేరు..

నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
నాలుగు భాషల్లో రీమేక్ అయిన సినిమా.. కానీ తెలుగులో డిజాస్టర్..
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం