Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..

ఈమధ్యకాలంలో సోషల్ మీడియాలో సీరియల్ ముద్దుగుమ్మలు చేసే రచ్చ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఇటు.. నెట్టింట గ్లామర్ ఫోజులతో మెంటలెక్కిస్తున్నారు. వరుసగా పోస్టులు చేస్తూ నెట్టింట సందడి చేస్తున్నారు. కానీ ఈ సీరియల్ నటి కష్టాల గురించి తెలుసా.. ? ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

Serial Actres: 16 ఏళ్లకే ఆడిషన్.. ఆపై బీ గ్రేడ్ సినిమాలు.. ఈ సీరియల్ హీరోయిన్ కష్టాలు చూస్తే..
Rashami Desai

Updated on: Sep 06, 2025 | 11:16 AM

సినీరంగంలో నటీనటులు సక్సెస్ కావడం అంత సులభం కాదు. చాలా మంది ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని చివరకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ తమ కెరీర్ తొలినాళ్లల్లో ఎదురైన అవమానాలు, విమర్శలు, క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ఇప్పుడు బహిరంగంగా పంచుకుంటున్నారు. అయితే సినిమా తారలే కాదు.. సీరియల్ తారలు సైతం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. తాజాగా ఓ సీరియల్ బ్యూటీ తన జీవితంలోని చీకటి రోజులను గుర్తుచేసుకున్నారు. 16 సంవత్సరాల వయసులో ఒక ఆడిషన్ సమయంలో ఒక వ్యక్తి తనను స్పృహ కోల్పోయేలా చేయడానికి ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ రష్మీ దేశాయ్.

ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..

ఇవి కూడా చదవండి

రష్మీ దేశాయ్.. హిందీలో పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యారు. అలాగే బిగ్ బాస్ షోలోను పాల్గొన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కెరీర్ మొదట్లో ఎదురైన అనుభవాలను చెప్పుకొచ్చింది. రష్మీ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలిరోజుల్లో నన్ను ఆడిషన్ కోసం పిలిచారు. అది నాకు ఇంకా గుర్తుంది. అక్కడికి వెళ్లినప్పుడు నేను తప్ప మరెవరు లేరు. నా వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో ఓ వ్యక్తి నాకు మత్తు మందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేయడానికి ప్రయత్నించాడు. నేను వెంటనే అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చాను. ఆ తర్వాత నా తల్లికి ప్రతి విషయం చెప్పాను ” అంటూ తెలిపింది.

ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..

అలాగే తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఆర్థిక కష్టాలను చూశానని వెల్లడించింది. దాదాపు 2.5 కోట్లు లోన్ తీసుకుని సొంతంగా ఇల్లు కొన్నానని.. తన పేరు మీద మొత్తం 3.25 కోట్ల వరకు అప్పు ఉందని.. అదే సమయంలో తాను చేస్తోన్న షో ఆగిపోవడంతో పరిస్థితి దారుణంగా మారిందని చెప్పుకొచ్చింది. ఎక్కడికి వెళ్లాలి.. ఎక్కడ ఉండాలో తెలియరాలేదని.. దీంతో తన ఆడి ఏ6 కారులోనే నాలుగు రోజులు ఉన్నానని తెలిపింది. ఈ బ్యూటీ కెరీర్ మొదట్లో కొన్ని బీ గ్రేడ్ చిత్రాల్లోనూ నటించింది.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..

ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..