Actor: అతడి కళ్లు అద్భుతం.. సెలబ్రెటీలు సైతం ఫిదా అయిన హీరో.. ఇంతకీ ఎవరంటే..

సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరో. అతడి కళ్లు అద్భుతం. విభిన్న సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసిన కుర్రాడు.. ఆ తర్వాత అమ్మ అప్పు తీర్చేందుకు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఇక ఇప్పుడు అతడు ఇండస్ట్రీలోనే తోపు హీరో. ఎవరంటే.

Actor: అతడి కళ్లు అద్భుతం.. సెలబ్రెటీలు సైతం ఫిదా అయిన హీరో.. ఇంతకీ ఎవరంటే..
Suriya

Updated on: Jul 24, 2025 | 8:44 AM

సినీనేపథ్యం ఉన్న కుటుంబం. ఇండస్ట్రీలో తండ్రికి మంచి గుర్తింపు. అయినప్పటికీ ఫ్యాక్టరీలో పనిచేశాడు. ఆ తర్వాత తన తల్లికి సాయం చేసేందుకు సినిమాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. దశాబ్దాల సినీప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించాడు. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాలతో.. అద్భుతమైన నటనతో తనదైన ముద్ర వేశారు. పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు మరెవరో కాదండి.. హీరో సూర్య. ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. విక్రమ్ వేద, జై భీమ్, సింగం, రక్త చరిత్ర వంటి సినిమాలతో నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. సూపర్ స్టార్ తన అద్భుతమైన నటనతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు. జూలై 23న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సూర్యకు సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

ఇవి కూడా చదవండి

సూర్య 1975 జూలై 23న జన్మించారు. ఆయన తండ్రి తమిళ నటుడు శివకుమార్. తల్లి లక్ష్మి. పద్మ శేషాద్రి బాల భవన్ స్కూల్, సెయింట్ బేడ్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తిచేశాడు. ఆ తర్వాత చెన్నైలోని లయోలా కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ముందు కొంతకాలం ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేశారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. శరవణన్ పేరుతో మరో నటుడు ఉండడంతో సూర్య తన పేరు మార్చుకున్నాడు. తెలుగు, తమిళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 1997 లో వసంత్ దర్శకత్వం వహించి మణిరత్నం నిర్మించిన నెర్రుక్కు నేర్ చిత్రంతో సూర్య తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టాడు . 2001లో వచ్చిన నందా సినిమాకు ఆయనకు బ్రేక్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!

కెరీర్ మంచి ఫాంలో ఉండగానే హీరోయిన్ జ్యోతికను ప్రేమించి 2006లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు దియా, దేవ్ అనే పాప, బాబు ఉన్నారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక ఇటీవలే రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నివేదికల ప్రకారం సూర్య ఆస్తులు రూ.240 కోట్లు.

ఇవి కూడా చదవండి:

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..

 

Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..