Tollywood: రోజుకు రూ.35 జీతం.. ఇప్పుడు కోట్లకు యజమాని.. అయినా పల్లెటూరిలో జీవితం..

ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు ఒకప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించినవారే. ఆర్థిక సమస్యలు.. తినడానికి తిండి లేకుండా జీవించి.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఇప్పుడు సినీరంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారే. అలాగే ఈ నటుడు ఒకరు. ఆయన జీవితం ఎంతోమందికి స్పూర్థిదాయకం. కెరీర్ ఫాంలో ఉండగానే అతడు సినిమాలు వదిలేసి కార్గిల్ యుద్ధం చేశారు.

Tollywood: రోజుకు రూ.35 జీతం.. ఇప్పుడు కోట్లకు యజమాని.. అయినా పల్లెటూరిలో జీవితం..
Nana Patekar

Updated on: Jul 08, 2025 | 10:14 PM

నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి తమదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు సైతం అలాంటి జాబితాలోకి చెందిన వారే. ఒకప్పుడు రూ.35 జీతానికి పనిచేసిన ఆయన.. ఇప్పుడు కోట్లకు యజమాని. అద్భుతమైన నటనతో సినీరంగంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినా కోట్లు వదిలేసి ఇప్పుడు పల్లెటూరిలో సాధారణ జీవితం గడుపుతున్నారు. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్. జనవరి 1, 1951న మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో జన్మించారు. ఆయన అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. ఆయనకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. కానీ పేదరికం కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

చదువు తర్వాత ఆర్ట్ స్కూల్‌లో చేరి జీబ్రా క్రాసింగ్ పెయింటర్‌గా పనిచేశాడు. అలాగే సినిమా పోస్టర్లు గీయడం, ప్రకటనలు సృష్టించడం వంటి చిన్న, పెద్ద ఉద్యోగాలు చేశాడు. అప్పట్లో అతను రోజుకు 35 రూపాయలు మాత్రమే సంపాదించేవాడు. నానా థియేటర్‌లో పనిచేయడం ప్రారంభించి ఆ తర్వాత సినిమా వైపు మళ్లాడు. దశాబ్దాలుగా సినీరంగంలో తనదైన ముద్రవేశారు. ‘పరిందా’, ‘ప్రహార్’, ‘క్రాంతివీర్’, ‘అబ్ తక్ ఛప్పన్’ చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి..

ప్రస్తుతం నానా పటేకర్ ఒక్క సినిమాకు రూ.1 కోటి పారితోషికం తీసుకుంటున్నారు. అతని మొత్తం సంపద దాదాపు 80 కోట్లు. అతను రైతుల కోసం ‘నామ్ ఫౌండేషన్’ను స్థాపించాడు. మరాఠ్వాడ, విదర్భలోని అనేక గ్రామాలలో సహాయ కార్యక్రమాలు చేపట్టాడు. ప్రస్తుతం తన గ్రామంలో నివసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Nana Patekar Life

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..