Tollywood: సొంతంగా ప్రైవేట్ విమానాలు ఉన్న స్టార్స్ వీళ్లే.. ప్రభాస్ నుంచి అల్లు అర్జున్ వరకు..
సినీరంగంలో సొంతంగా విమానాలు ఉన్న స్టార్స్ ఎవరెవరో తెలుసా.. ? బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు హీరోలు ఇప్పుడు భారీగా పారితోషికం తీసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు సెలబ్రెటీల లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ జెట్స్ ఉన్న స్టార్స్ గురించి ఇప్పుుడు తెలుసుకుందామా.

సౌత్ నుంచి నార్త్ వరకు టాప్ హీరోస్ ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రాల ట్రెండ్ ఎక్కువగా సాగుతుండడంతో ఇటు స్టార్స్ సైతం తమ రెమ్యునరేషన్ పెంచేశారు. షారుఖ్, ప్రభాస్, సల్మాన్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తమ అభిమాన తారల లైఫ్ స్టైల్, సంపాదన గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోని కొందరు తారలకు సొంతంగా విమానాలు ఉన్నాయి. ఇంతకీ వారెవరెవరో తెలుసుకుందామా.
బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ ఇద్దరికీ ఒక్కొక్కరికి రూ.260 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్‌లు ఉన్నాయి. అలాగే హీరో అజయ్ దేవగన్ కు ఆరు సీట్లు కలిగిన హాకర్ 800 ప్రైవేట్ జెట్ ఉంది. దీని విలువ రూ.85 కోట్లు. అలాగే షారుఖ్ ఖాన్ కు వివిధ సౌకర్యాలతో కూడిన ప్రైవేట్ విమానం ఉంది. ప్రియాంక చోప్రా, శిల్పా శెట్టి, సైఫ్ అలీ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్ సైతం ప్రైవేట్ జెట్స్ కలిగి ఉన్నారు. ఇక సౌత్ ఇండస్ట్రీలోనూ చాలా మంది స్టార్స్ కు ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లకు ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. అంతేకాకుండా చరణ్ కు సొంతంగా ట్రూజెట్ అనే విమానయాన సంస్థ కూడా ఉంది. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ల దగ్గర రూ.1,000 విలువైన ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి.
అలాగే అక్కినేని నాగార్జున, నాగచైతన్య వద్ద సైతం సొంతంగా విమానం ఉంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, విజయ్ దళపతి వద్ద సైతం సొంతంగా విమానాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
