- Telugu News Photo Gallery Cinema photos Rajamouli RRR to Chiranjeevi Vishwambhara latest movie news from industry
Tollywood News: వందేళ్ల కల నెరవేరిందన్న రాజమౌళి.. రామ రామ అంటూ చిరు..
వందేళ్ల కల నెరవేరిందన్నారు దర్శకుడు రాజమౌళి. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటిస్తున్న 'రైడ్2' నుంచి అప్డేట్. రాజేంద్రప్రసాద్, అర్చన కీలక పాత్రల్లో నటించిన సినిమా 'షష్టిపూర్తి'. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. తనకు దర్శకత్వం మీద మొదటి నుంచీ ఆసక్తి ఉందన్నారు హృతిక్. ఇలాంటి సినిమా అప్డేట్స్ ఈరోజు మనం చూద్దాం..
Updated on: Apr 12, 2025 | 10:15 AM

వందేళ్ల కల నెరవేరిందన్నారు దర్శకుడు రాజమౌళి. 2027 నుంచి ఆస్కార్ అవార్డుల్లో స్టంట్ కేటగిరీకి కూడా పురస్కారాలు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఇచ్చిన పోస్టర్‌లో 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్', 'మిషన్ ఇంపాజిబుల్'తో పాటు 'ట్రిపుల్ ఆర్' విజువల్ కూడా ఉంది.

'రైడ్2'లో స్పెషల్ సాంగ్ చేశారు తమన్నా భాటియా. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ఇది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్నా స్టెప్పులేసిన 'నషా నషా..' సాంగ్ హుషారుగా సాగుతుంది.

రాజేంద్రప్రసాద్, అర్చన కీలక పాత్రల్లో నటించిన సినిమా 'షష్టిపూర్తి'. ఈ సినిమాలో 'ఇరు కనుల మెరిసే మొదటి చూపులో..' పాటను విడుదల చేశారు మేకర్స్. ఇళయరాజా సంగీతం అందించారు. ఎస్‌పీ చరణ్ ఆలపించారు.

చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'విశ్వంభర'. ఈ సినిమా నుంచి 'రామ రామ అనే పాటను హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు విడుదల చేయనున్నారు. నిన్న పాట ప్రోమోను రిలీజ్ చేశారు. కీరవాణి సంగీతం అందించారు.

తనకు దర్శకత్వం మీద మొదటి నుంచీ ఆసక్తి ఉందన్నారు హృతిక్. 'క్రిష్4'కి డైరక్ట్ చేయడమంటే మళ్లీ స్కూలుకు వెళ్లినట్టేనన్నారు. ఎన్నో రంగాల మీద పట్టు పెంచుకోవాలని చెప్పారు. భవిష్యత్తులో ఎన్ని విమర్శలు ఎదురైనా తట్టుకోవడానికి సిద్ధపడే అడుగులు వేస్తున్నట్టు తెలిపారు.




