- Telugu News Photo Gallery Cinema photos Rajamouli to Karthik Aryan latest movie updates from film industry
Tollywood Updates: వారిని ప్రశంసించిన జక్కన్న.. కార్తిక్ ఆర్యన్ పాముల పోరాటం..
సంపూర్ణేష్ బాబు, సంజోష్ నటించిన సినిమా 'సోదరా'. ఒడిశాలో వారిని ప్రశంసించిన జక్కన్న. రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటించిన సినిమా 'భూల్ చుక్ మాఫ్'. కార్తిక్ ఆర్యన్ తదుపరి చిత్రం కథ పాము చుట్టూ తిరగనుంది. బాలీవుడ్‌లో నవ్వులు కురిపించిన సినిమాల్లో 'ధమాల్' సీరీస్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇలాంటి మూవీ న్యూస్ ఈరోజు తెలుసుకుందాం..
Updated on: Apr 12, 2025 | 9:41 AM

ఒడిశాలోని దేవ్‌మాలిని పర్వత ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను తొలగించడంపై ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి స్పందించారు. పర్వతంపై ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించిన వారి చొరవను ప్రశంసించారు. 'భవిష్యత్తు తరాల కోసం మన సహజ సంపదను కాపాడుకోవడానికి కృషి చేస్తూనే ఉందాం' అన్నారు.

సంపూర్ణేష్ బాబు, సంజోష్ నటించిన సినిమా 'సోదరా'. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. సాయిరాజేష్ ట్రైలర్‌ని విడుదల చేశారు. సంపూర్ణేష్‌బాబుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.

రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటించిన సినిమా 'భూల్ చుక్ మాఫ్'. వామికా గబ్బీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకలు పునరావృతం కావడం నవ్వులు తెప్పిస్తోంది. మే 9న విడుదల కానుంది 'భూల్ చుక్ మాఫ్'.

కార్తిక్ ఆర్యన్ తదుపరి చిత్రం కథ పాము చుట్టూ తిరగనుంది. పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా కరణ్‌జోహార్ తెరకెక్కించనున్నారు. 'నాగరాజ్' అనే టైటిల్‌ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. పాములతో పోరాడే వ్యక్తిగా కార్తిక్ కనిపిస్తారు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

బాలీవుడ్‌లో నవ్వులు కురిపించిన సినిమాల్లో 'ధమాల్' సీరీస్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు 'ధమాల్ ఫోర్త్ చాప్టర్' తెరకెక్కుతోంది. ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తయింది. 'మ్యాడ్‌నెస్ ఈజ్ బ్యాక్. ముంబైలో సెకండ్ షెడ్యూల్ చేస్తాం' అన్నారు అజయ్ దేవ్‌గణ్.




