Life Is Beautiful: లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ నవీన్ పోలిశెట్టి కాకుండా ఎంతమంది హీరో హీరోయిన్స్ ఉన్నారో తెలుసా..?
శేఖర్ కమ్ముల సినిమాల్లో పెద్దగా హడావిడి ఉండదు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, అదిరిపోయే ఎలివేషన్స్, దుమ్మురేపే డైలాగ్స్ ఉండవు. చాలా సింపుల్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథనంతో ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు. ఆయన తెరకెక్కించిన అందమైన సినిమాల్లో లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ సినిమా ఒకటి. అభిజిత్, సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఆకట్టుకుంది.

సెన్సిబుల్ దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. మంచి కాఫీలాంటి సినిమాలు తీసి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు ఈ టాలెంటెడ్ దర్శకుడు. శేఖర్ కమ్ముల సినిమాల్లో పెద్దగా హడావిడి ఉండదు. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు, అదిరిపోయే ఎలివేషన్స్, దుమ్మురేపే డైలాగ్స్ ఉండవు. చాలా సింపుల్ కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథనంతో ఉంటాయి శేఖర్ కమ్ముల సినిమాలు. ఆయన తెరకెక్కించిన అందమైన సినిమాల్లో లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ సినిమా ఒకటి. అభిజిత్, సుధాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఆకట్టుకుంది. మన ఇంట్లో, మన కాలనీలో జరిగే కథతో అనుబంధాల విలువలు చెప్తూ శేకర్ కమ్ముల తెరకెక్కించిన తీరు అద్భుతం అనే చెప్పాల్సి. ఇక ఈ సినిమాలో చాలా మంది నటులు ఉన్నారు.
లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ సినిమాలో నటించిన ప్రధాన పాత్రలు అభిజిత్, సుధాకర్ పెద్దగాపేరు తెచుకోలేకపోయినా మిగిలినవారు మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందులో కొంతమంది హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ గురించే. లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ చాలా మంది గుర్తుపట్టుండారు. గోల్డ్ ఫేస్ లో ఉండే కుర్రాడిగా నటించాడు విజయ్. అలాగే అదే గోల్డ్ ఫేస్ కుర్రాడిగా విజయ్ ఫ్రెండ్ గా నడిచాడు నవీన్ పోలిశెట్టి. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నవీన్ పోలిశెట్టి కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్. హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు.
అలాగే ఈ సినిమాలో తెలుగమ్మాయి ఈషరెబ్బ కూడా ఉన్నారు. సరిగ్గా గమనిస్తే ఆమె కూడా కనిపిస్తుంది. ఇక ఎవ్వరు ఊహించనిది ఈ సినిమా మరో టాలెంటెడ్ హీరో కూడా ఉన్నారు. అతనే శ్రీ విష్ణు. లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ సినిమాలో హీరో అభిజిత్ ఫ్యామిలీ మెంబర్ లా నటించారు శ్రీ విష్ణు. అలాగే ఈ సినిమాలో గోల్డ్ ఫేస్ అమ్మాయిగా నటించిన యాంకర్ శ్రీముఖిని ప్రేమించి పెళ్లి చేసుకునేది శ్రీవిష్ణునే.. శ్రీ విష్ణు ఇప్పుడు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా సామజవరగమనా సినిమాతో హిట్ అందుకున్నాడు. చాందిని చౌదరి కూడా ఈ సినిమాలో కనిపిస్తుంది. అలాగే సీనియర్ నటి అమల, అంజలి జవేరి, శ్రియ ఇలా లైఫ్ ఈస్ బ్యూటీ ఫుల్ సినిమాలో చాలా మంది హీరో హీరోయిన్స్ ఉన్నారు. శేఖర్ కమ్ముల సినిమాలో కనిపించి కనిపించకుండా నటించిన వీరంతా ఇప్పుడు మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.