AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 7: పాపం గౌతమ్.. టాస్క్‌లో ఓడినా గెలిచినట్లే.. ఇంతలా మోసం చేస్తారా..?

టైమ్ ఉంది కదా నేను కంప్లీట్ చేసేవాడిని అని గౌతమ్ వివరణ కోరగా.. అది నా బాధ్యత కాదంటూ తప్పుకున్నాడు సందీప్. 28 ఎవరు తినలేదు కనక.. శోభా శెట్టి విన్నర్ అని ప్రకటించారు బిగ్ బాస్. ఆ తర్వాత ఆమె హడావిడి మాములుగా లేదు. ఏదో బిగ్ బాస్ విన్నర్ అయినంత బిల్డప్ ఇచ్చింది. నిజానికి సందీప్ మాస్టర్ అక్కడే గౌతమ్ డిస్ క్వాలిఫైడ్ అని ప్రకటించి ఉంటే.. శుభ శ్రీ లేదా ప్రశాంత్ కూడా క్విట్ అవ్వకుండా టాస్క్ మొత్తం కంప్లీట్ చేసేవారు.

Bigg Boss Telugu 7: పాపం గౌతమ్.. టాస్క్‌లో ఓడినా గెలిచినట్లే.. ఇంతలా మోసం చేస్తారా..?
Gautham Krishna
Ram Naramaneni
|

Updated on: Sep 22, 2023 | 11:37 AM

Share

బిగ్ బిస్ సీజన్‌లో డీసెంట్ ఫెల్లో ఎవరు అంటే.. గౌతమ్ కృష్ణ అని చెప్పవచ్చు. ఒక్క యావర్‌తో జరిగిన డిస్కషన్‌తో తప్ప అతడెక్కడా ఎక్స్ ట్రాలు చేయలేదు. షకీలా సైతం రియల్ ప్రిన్స్ గౌతమ్ అని.. అతడిని తల్లిదండ్రులు ఎంతో గొప్పగా పెంచారని.. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ వారం నామినేషన్‌లో ఉన్న గౌతమ్‌కు ఓట్లు ఓ మాదిరిగా పడుతున్నాయి. ఇకపోతే గురువారం జరిగిన టాస్క్‌లో గౌతమ్‌ను అటు బిగ్ బాస్ టీమ్, ఇటు సంచాలక్ సందీప్ దారుణంగా మోసం చేశారు. కారంగా ఉన్న చికెన్ పీసులు తినడం అనేది టాస్క్. ఇందులో ఆమె మస్ట్ ఫెర్ఫామ్ చేసింది. ఏకంగా 27 పీసులు తిన్నది. అక్కడివరకు ఓకే… ఆ తర్వాత ఆమె అభ్యర్థిత్వాన్ని ఛాలెంజ్ చేసిన గౌతమ్, శుభ శ్రీ, పల్లవి ప్రశాంత్.. ఈ టాస్క్ ఫెర్ఫామ్ చేశారు. తక్కువ టైమ్‌లో ఆమె కంటే ఎక్కవ పీసులు తింటే.. వారు హౌస్ మేట్ కంటెండర్ అవుతారని.. బిగ్ బాస్ తెలిపాడు. ఇక టాస్క్‌కు సందీప్ సంచాలకుడిగా వ్యహరించాడు. అయితే ఈ ముగ్గురు సరిగ్గా తింటున్నారో, లేదో చెప్పాల్సింది.. చూడాల్సింది సందీప్. అతి తక్కువ టైమ్‌లోనే 28 పీసులు తినేశాడు.. గౌతమ్. ఆ తర్వాత వెళ్లి బెల్ కొట్టాడు. ఇక్కడివరకు ఓకే. ఆ తర్వాత.. నువ్వు 28వ పీస్ సరిగ్గా తినలేదు అంటూ.. కొత్త వాదనకు తెరలేపాడు సందీప్. దీంతో గౌతమ్ వాపోయాడు.

ఆ విషయం అక్కడే చెప్పాలి కదా.. టైమ్ ఉంది కదా నేను కంప్లీట్ చేసేవాడిని అని గౌతమ్ వివరణ కోరగా.. అది నా బాధ్యత కాదంటూ తప్పుకున్నాడు సందీప్. 28 ఎవరు తినలేదు కనక.. శోభా శెట్టి విన్నర్ అని ప్రకటించారు బిగ్ బాస్. ఆ తర్వాత ఆమె హడావిడి మాములుగా లేదు. ఏదో బిగ్ బాస్ విన్నర్ అయినంత బిల్డప్ ఇచ్చింది. నిజానికి సందీప్ మాస్టర్ అక్కడే గౌతమ్ డిస్ క్వాలిఫైడ్ అని ప్రకటించి ఉంటే.. శుభ శ్రీ లేదా ప్రశాంత్ కూడా క్విట్ అవ్వకుండా టాస్క్ మొత్తం కంప్లీట్ చేసేవారు. ఎందుకంటే అక్కడ ఇంకా టైమ్ ఉంది కనుక. మొత్తంగా నామినేషన్స్‌లో మంచి గొడవ జరిగేందుకు.. కావాల్సినంత అగ్గి రాజేశారు బిగ్ బాస్.

ఇకపోతే ఈ వారం దామిని డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనధికార పోల్స్‌లోనూ ఆమె లీస్ట్ ఓటింగ్ ఉంది. ఎదైనా షాకింగ్ నిర్ణయం తీసుకుంటే తప్ప.. దామిని బయటకు రావడం లాంఛన ప్రాయమే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!