Tamannaah Bhatia:మరి అంత తక్కువా..!! తొలి సినిమా చేసేటప్పటికి తమన్నా ఏజ్ ఎంతో తెలుసా.?
కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న సినిమాల్లో నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ నటి తమన్నా భాటియా వయసు ఇప్పుడు 33 ఏళ్లు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పిస్తోంది.

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న భామల్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. తమన్నా హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి చాలా కాలమే పట్టింది. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న సినిమాల్లో నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన శ్రీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ నటి తమన్నా భాటియా వయసు ఇప్పుడు 33 ఏళ్లు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి మెప్పిస్తోంది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది తమన్నా.
తమన్నా ముందుగా హిందీ సినిమాలతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. తమన్నాకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో దాదాపు 18 ఏళ్ల క్రితం నాటిది. ఇందులో తమన్నా తన మొదటి సినిమా గురించి మాట్లాడుతుంది. తొలి సినిమా చేసిన సమయంలో ఆమె స్కూల్ లో చదువుతున్నా అని తెలిపింది. ఇది చూసిన నెటిజన్లు చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు తమన్నా 36 ఏళ్ల మహిళగా కనిపించేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు .
2005లో విడుదలైన ‘చాంద్ స రోషన్ చెహ్రా’ చిత్రంలో తమన్నా తొలిసారిగా నటించింది. ఆ సినిమా అంగీకరించే నాటికి ఆమె వయసు కేవలం పదమూడున్నరేళ్లు! ఆ అనుభవం గురించి ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
‘నేను అప్పుడు స్కూల్‌లో చదువుతున్నాను. ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాను. 2005లో 10వ తరగతి పరీక్ష రాయడానికి రెడీ అవుతున్న. నేను ఈ సినిమాకి సంతకం చేసినప్పుడు నా వయసు పదమూడున్నరేళ్లు అని తమన్నా భాటియా ఈ వీడియోలో పేర్కొంది. ఇక తమన్నా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో క్రేజీ ఆఫర్స్ ఉన్నారు. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది తమన్నా. హిందీలో కూడా విపరీతమైన అభిమానులను సొంతం చేసుకుంది తమన్నా .
View this post on Instagram
తమన్నా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.