AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohanlal: ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు.. మోహన్ లాల్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23న న్యూఢిల్లీలో జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించనున్నారు.

Mohanlal: ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు.. మోహన్ లాల్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
Superstar Mohanlal To Receive Dadasaheb Phalke Award
Rajitha Chanti
|

Updated on: Sep 22, 2025 | 11:24 AM

Share

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నారు. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ కుర్ర హీరోలకు గట్టిపోటినిస్తున్నారు. తాజాగా ఆయనకు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. సెప్టెంబర్ 23న న్యూఢిల్లీలో జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 20న ప్రకటించింది. భారతీయ సినిమాకు మోహన్ లాల్ చేసిన అసమాన కృషికి, అలాగే దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో ఆయన చేసిన సేవలకుగానూ ఈ అవార్డు ప్రకటించారు. దీంతో ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్‏బాస్ హౌస్‏లో ఆడపులి.. యూత్‏కు తెగ నచ్చేస్తోన్న కంటెస్టెంట్..

ఇవి కూడా చదవండి

తాజాగా మోహన్ లాల్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే నివేదికల ప్రకారం ఆయన ఆస్తులు రూ.427.5 కోట్ల వరకు ఉంటుంది. అలాగే ఆయన రెస్టారెంట్ బిజినెస్ లో రాణిస్తున్నారు. చెన్నై, కొచ్చిలోని ఓ ఆసుపత్రి, సినిమా థియేటర్ వంటి అనేక వాటిలో పెట్టుబడులు పెట్టారు. కొచ్చిలో 9,000 చదరపు అడుగుల విలాసవంతమైన డ్యూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కలిగి ఉన్నారు. మోహన్ లాల్ వద్ద రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్ బెంజ్ SLS AMG, పోర్స్చే కయెన్, BMW X5 వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి : Tollywood : అబ్బబ్బో.. సీరియల్లో అమాయకంగా.. నెట్టింట పిచ్చెక్కించేలా.. హీరోయిన్స్ సైతం దిగదుడుపే..

1960 మే 21న జన్మించిన మోహన్ లాల్ 1978లో ‘తిరనోత్తం’ చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించారు. 360కి పైగా చిత్రాలతో, ఆయన ‘కిరీడం’, ‘భారతం’, ‘వానప్రస్థం’, ‘పులిమురుగన్’, ‘దృశ్యం’ సిరీస్ వంటి క్లాసిక్‌లను అందించారు. ఆయన ఐదు జాతీయ చలనచిత్ర అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్‌లను అందుకున్నారు.

ఇవి కూడా చదవండి : Tollywood: స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ అమ్మడు..

View this post on Instagram

A post shared by Mohanlal (@mohanlal)

ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi: అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఆ తర్వాత చిరు చెల్లెలిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పుడు బుల్లితెరపై..