AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: మనీశ్ ఎలిమినేషన్‌కు కారణాలివే.. బిగ్ బాస్ ద్వారా ఈ స్టార్టప్ ఫౌండర్ ఎంత సంపాదించాడంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ రెండో వారం కూడా ముగిసింది. చాలా మంది అనుకున్నట్లు గానే మర్యాద మనీశ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఇక తక్కువగా ఓట్లు పడినప్పటికీ వరుసగా రెండో వారం కూడా ఎలిమినేషన్ తప్పించుకుంది ఫ్లోరా షైనీ.

Bigg Boss Telugu 9: మనీశ్ ఎలిమినేషన్‌కు కారణాలివే.. బిగ్ బాస్ ద్వారా ఈ స్టార్టప్ ఫౌండర్ ఎంత సంపాదించాడంటే?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Sep 22, 2025 | 10:43 AM

Share

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో అప్పుడే రెండు వారాలు పూర్తి చేసుకుంది. అప్పుడే ఇద్దర కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. మొదటి వారంలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ కాగా, రెండో వారంలో కామనర్ మర్యాద మనీశ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన మనీష్ మొదటి వారంలో బాగానే ఆడాడు. అయితే హౌజ్‌లో ప్రతి దానిపై ఓవర్‌గా థింక్ చేయడం మనీశ్ కు మైనస్ అయ్యింది. చిన్న విషయమైన వంద కోణాల్లో చూడటం మనీశ్ కు బాగా నెగెటివ్ అయ్యింది. అలాగే ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న భరణితో మనీశ్ వ్యవహరించిన తీరు ఆడియెన్స్ కు ఏ మాత్రం నచ్చలేదు. పైగా నామినేషన్స్ లో పని గట్టుకుని మరీ టెనెంట్స్ ను నామినేట్ చేశాడు. ఈ కారణాలే మనీష్ మర్యాద ఎలిమినేషన్‌కు దారి తీసిందని పలువురు రివ్యూవర్స్ భావిస్తున్నారు.

రెండో వారం నామినేషన్స్‌లో మర్యాద మనీష్‌తో పాటు, సుమన్‌శెట్టి, ప్రియ, డిమోన్‌ పవన్‌, హరిత హరీశ్‌, ఫ్లోరా షైనీ, భరణిలు ఉన్నారు. చివరికి ఫ్లోరా, మనీష్‌ల మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరకు ప్రేక్షకులను నుంచి అత్యధిక ఓట్లు పొందిన ఫ్లోరా సేఫ్‌ అయింది. మనీశ్ బయటకు వచ్చేశాడు.

ఇవి కూడా చదవండి

అప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’.. ఇప్పుడు బిగ్ బాస్..

బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలో తాను స్టార్టఫ్ ఫౌండర్ అని చెప్పాడు మర్యాద మనీశ్. అంటే తనకు భారీగానే జీతం వస్తుందన్నమాట. మరి లక్షల సంపాదన ఉన్న మనీష్ మర్యాద బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ద్వారా ఎంత సంపాదించాడనేది ఆసక్తికరంగా మారింది. అగ్ని పరీక్ష కాంటెస్ట్ ను విజయవంతంగా అధిగమించి బిగ్ బాస్ కు వచ్చిన మనీశ్ వారానికి రూ. 60 నుంచి 70 వేల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అంటే, ఈ లెక్కన రెండు వారాలు ఉన్న మనీష్ మర్యాద బిగ్ బాస్ 9 తెలుగు ద్వారా రూ. లక్షా 40 నుంచి లక్షా 50 వేల వరకు సంపాదించడని తెలుస్తోంది. కాగా గతం లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షో లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు మనీశ్. ఇప్పుడు బిగ్ బాస్ షోలోనూ సందడి చేసి బయటకు వచ్చాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..