Coolie Movie: రూ.350 కోట్ల బడ్జెట్.. కూలీ సినిమాకు రజినీ, నాగార్జున రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..
ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ మూవీ విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మరో రెండు రోజుల్లో ఈ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాలోని నటీనటుల పారితోషికాల గురించి నెట్టింట చర్చ నడుస్తుంది.

2025లో అత్యధిక క్యూరియాసిటీ, హైప్ ఉన్న సినిమాల్లో కూలీ ఒకటి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 14న తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో రిలీజ్ చేయనున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాలో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర కీలకపాత్రలు పోషించారు. ఇక ఇందులో పూజా హెగ్డే మోనికా స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. మొత్తం 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బడ్జెట్‌లో ఎక్కువ భాగం స్టార్స్ రెమ్యునరేషన్స్ కోసం ఖర్చు అయినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
నివేదికల ప్రకారం ఈ సినిమా కోసం రజినీకాంత్ రూ.150 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారట. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో రజినీ ఒకరు. ఇక ఇందులో విలన్ గా కనిపించనున్న నాగార్జున కేవలం రూ.10 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఇందులో దాదాపు 20 నిమిషాల పాటు కనిపించినందుకు అమీర్ ఖాన్ పారితోషికం 20 కోట్లు కాగా. మోనికా అనే ఒకే ఒక్క పాటలో కనిపించే పూజా హెగ్డే ఏకంగా 3 కోట్లు తీసుకుందట. కన్నడ స్టార్ ఉపేంద్ర, శ్రుతి హాసన్ కూలీ సినిమా కోసం 4 కోట్లు పారితోషికం తీసుకున్నారు. ఈ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నారు రజినీ.
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..
ఆగస్ట్ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే తమిళనాడులో తలైవా ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. మరోవైపు కూలీ సినిమా హిట్టు కావాలంటూ ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం కూలీ అడ్వాన్స్ బుకింగ్స్ 1వ రోజుకు 8,35,850 టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
Are you ready for the #Coolie mania in theatres near you? 🤩#Coolie releasing worldwide August 14th@rajinikanth @Dir_Lokesh @anirudhofficial #AamirKhan @iamnagarjuna @nimmaupendra #SathyaRaj #SoubinShahir @shrutihaasan @hegdepooja @Reba_Monica @monishablessyb @anbariv… pic.twitter.com/CKVStiVOz9
— Sun Pictures (@sunpictures) August 11, 2025
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..








