AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: పవన్‌తో సహా అయోధ్య రాముడికి విరాళమిచ్చిన సినీ ప్రముఖులు వీరే .. ఒక్కొక్కరు ఎంతిచ్చారంటే?

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పలువరు ప్రముఖులు ఉడతా భక్తిగా విరాళమందించారు. ఇందులో పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, ప్రణీతా సుభాస్‌, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ఆదిరెడ్డి, అక్షయ్‌ కుమార్, , అనుపమ్ ఖేర్, హేమ మాలిని, మనోజ్ జోషి, గుర్మీత్ చౌదరి, ముఖేష్ ఖన్నా, మనీష్ ముంద్రా తదితర ప్రముఖులు రామ మందిర నిర్మాణంలో భాగం పంచుకున్నారు.

Ayodhya Ram Mandir: పవన్‌తో సహా అయోధ్య రాముడికి విరాళమిచ్చిన సినీ ప్రముఖులు వీరే .. ఒక్కొక్కరు ఎంతిచ్చారంటే?
Adireddy, Pranita, Pawan Kalyan
Basha Shek
|

Updated on: Jan 20, 2024 | 11:47 AM

Share

అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గర పడింది. జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరగనున్నాయి. ఈ మహా క్రతువు కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పలువరు ప్రముఖులు ఉడతా భక్తిగా విరాళమందించారు. ఇందులో పలువురు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, ప్రణీతా సుభాస్‌, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ఆదిరెడ్డి, అక్షయ్‌ కుమార్, , అనుపమ్ ఖేర్, హేమ మాలిని, మనోజ్ జోషి, గుర్మీత్ చౌదరి, ముఖేష్ ఖన్నా, మనీష్ ముంద్రా తదితర ప్రముఖులు రామ మందిర నిర్మాణంలో భాగం పంచుకున్నారు. మరి ఈ చారిత్రాత్మక నిర్మాణం కోసం ఎవరెవరు ఎంతెంత విరాళమిచ్చారో తెలుసుకుందాం రండి.

పవన్‌ కల్యాణ్‌..

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్న టాలీవుడ్‌ ప్రముఖుల్లో పవన్ కల్యాణ్ కూడా ఒకరు. ఈ మందిర నిర్మాణానికి రూ. 30 లక్షలకు పైగా విరాళం ఇచ్చారు పవర్‌ స్టార్‌. అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభం కాగానే అంటే 2021లోనే ఈ ఈ విరాళమందజేశారు పవన్‌ కల్యాణ్‌. అలాగే తనతో సినిమాలు చేసే దర్శక నిర్మాతలతో కూడా విరాళం అందించారట పవన్‌ కల్యాణ్‌. మొత్తానికి జనసేన అధినేత తరఫు నుండి అయోధ్య రామ మందిర నిర్మాణానికి సుమారు 80 లక్షల రూపాయల వరకు విరాళాలు వెళ్లాయని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రణీతా సుభాష్‌..

టాలీవుడ్ బాపూ బొమ్మ ప్రణీతా సుభాష్ అయోధ్య రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకుంది. గతంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం చేపట్టిన దేశవ్యాప్త ప్రచారానికి రూ.1 లక్ష విరాళంగా ఇచ్చారామె. ‘అయోధ్య రామమందిర నిధి సమర్పణ అభియాన్ కోసం నేను రూ. 1 లక్ష ఇచ్చాను. మీరందరూ చేతులు కలపాలి’ అని పిలుపునిచ్చింది ప్రణీత.

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ ఆదిరెడ్డి..

తెలుగు బిగ్‌ బాస్‌ ఆరో సీజన్‌ కంటెస్టెంట్‌ ఆది రెడ్డి రాముడిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించాడాయన. ఈ విషయాన్ని ఆయనే సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకున్నాడు.

అక్షయ్‌ కుమార్‌..

ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రామమందిర నిర్మాణం కోసం విరాళం ప్రకటించారు. అయితే ఎంతిచ్చారో స్పష్టంగా చెప్పలేదు. ‘ అయోధ్యలో రాముని మందిరం మళ్లీ ప్రారంభం కావడం చాలా సంతోషం. ఇందుకు మనందరం చేతులు కలపాలి’ అని విరాళమిచ్చిన సందర్భంలో చెప్పుకొచ్చారు అక్షయ్‌.

వీరు కూడా..

అనుపమ్ ఖేర్- (అయోధ్య రామమందిరానికి ఇటుకల విరాళం) ముఖేష్ ఖన్నా- 1.11 లక్షల రూపాయలు మనీష్ ముంద్రా- కోటి రూపాయలు హేమ మాలిని గుర్మీత్ చౌదరి గౌతమ్‌ గంభీర్‌- కోటి రూపాయలు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us