AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: సోనూసూద్ డీప్ ఫేక్ వీడియోతో డబ్బులు అడుగుతున్నారు.. జాగ్రత్తగా ఉండాలంటూ రియల్ హీరో ట్వీట్..

ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొందరు ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సోనూ సూద్ డీప్ ఫేక్ వీడియోతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. కరోనా కష్ట సమయాల్లో ఎంతో మందికి అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనుసూద్. కానీ ఇప్పుడు కొందరు ఆకతాయిలు అతడి ఫేక్ వీడియో క్రియేట్ చేసి అభిమానుల నుంచి డబ్బులు అడుగుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్వి్ట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ..

Sonu Sood: సోనూసూద్ డీప్ ఫేక్ వీడియోతో డబ్బులు అడుగుతున్నారు.. జాగ్రత్తగా ఉండాలంటూ రియల్ హీరో ట్వీట్..
Sonu Sood
Rajitha Chanti
|

Updated on: Jan 20, 2024 | 11:34 AM

Share

సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోస్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లకు సంబంధించిన ఫేక్ వీడియో వైరలయ్యాయి. రష్మిక మందన్నా, అలియా భట్, కృతి సనన్ ఫేక్ వీడియోస్ వైరలయ్యాయి. అలాగే సచిన్ టెండూల్కర్ వీడియో కూడా బయటపడింది. అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు కొందరు ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి జనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు సోనూ సూద్ డీప్ ఫేక్ వీడియోతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. కరోనా కష్ట సమయాల్లో ఎంతో మందికి అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు సోనుసూద్. కానీ ఇప్పుడు కొందరు ఆకతాయిలు అతడి ఫేక్ వీడియో క్రియేట్ చేసి అభిమానుల నుంచి డబ్బులు అడుగుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్వి్ట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించాడు సోనూసూద్.

“కొందరు నా డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేసి అభిమానులతో చాటింగ్, వీడియో కాల్ చేస్తూ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారు. చాలా మంది అమాయకులు ఆ వీడియోలో ఉన్నది నేనే అనుకొని సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. ఇలాంటి వీడియో కాల్స్ వస్తే నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి.” అంటూ డీప్ ఫేక్ వీడియోను షేర్ చేశాడు సోనూ. నిజ జీవితంలో జరిగిన ఇలాంటి ఘటనల మీదే తాను ఫతే అనే సినిమా తీస్తున్నట్లు చెప్పారు. అందులో డీప్ ఫేక్ వీడియోస్, లోన్ యాప్స్ వల్ల జరుగుతున్న సైబర్ నేరాలను అందులో చూపించనున్నట్లు తెలిపారు.

సోనూసూద్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరలయ్యింది. తమను అప్రమత్తం చేసినందుకు సోనూకు ధన్యవాదాలు తెలుపుతున్నారు అభిమానులు. సోనూ సూద్ నటిస్తోన్న ఫతే సినిమాకు వైభవ్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తుండగా.. ఈ ఏడాది ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us