Vijay Sethupathi: షాకింగ్ లుక్లో విజయ్ సేతుపతి.. నెట్టింట వైరలవుతున్న ఫోటో..
క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం మొదలుపెట్టిన అతను.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆయనకు అభిమానులు ఉన్నారు. గతేడాది జవాన్ సినిమాతో నార్త్ ఇండియా ప్రేక్షకులను అలరించాడు విజయ్. షారుఖ్ ఖాన్ నటించిన ఈ మూవీలో ప్రతినాయకుడిగా కనిపించి మరోసారి మెప్పించారు. ఇక ఇటీవలే మెర్రీ క్రిస్మస్ సినిమాతో హిట్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత సోలోగా నటించి భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఇదే.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అంటే గుర్తుపట్టనివారుండరు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. సినీ పరిశ్రమలో ఆయన ప్రత్యేకం. ఎలాంటి పాత్రలో అయినా.. ఏ భాష సినిమాలో అయిన నటించి ప్రశంసలు అందుకుంటాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రయాణం మొదలుపెట్టిన అతను.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఆయనకు అభిమానులు ఉన్నారు. గతేడాది జవాన్ సినిమాతో నార్త్ ఇండియా ప్రేక్షకులను అలరించాడు విజయ్. షారుఖ్ ఖాన్ నటించిన ఈ మూవీలో ప్రతినాయకుడిగా కనిపించి మరోసారి మెప్పించారు. ఇక ఇటీవలే మెర్రీ క్రిస్మస్ సినిమాతో హిట్ అందుకున్నాడు. చాలా రోజుల తర్వాత సోలోగా నటించి భారీ విజయాన్ని అందుకున్న సినిమా ఇదే. ఈ చిత్రంలో కత్రీనా కైఫ్ కథానాయికగా నటించింది.
అటు హీరోగా.. ఇటు సహాయ నటుడిగా.. మరోవైపు విలన్ పాత్రలు పోషిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఏకైక హీరో విజయ్ సేతుపతి. హీరోయిజం కాదు.. కంటెంట్.. పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలు ఎలాంటి సినిమా అయినా ఒప్పుకుంటూ నటుడిగా క్షణం తీరిక లేకుండా ఉంటున్నాడు. తెలుగులో ఉప్పెన సినిమాలో ప్రతినాయకుడు రాయనం పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచాడు. జవాన్, ఉప్పెన సినిమాలతో అలరించిన విజయ్ సేతుపతికి ఇప్పుడు ఇండియా మొత్తంలో అవకాశాలు క్యూ కట్టాయి. ఇటీవలే ఆయన పుట్టినరోజు వేడుకలకు ఘనంగా నిర్వహించారు ఫ్యాన్స్. అటు సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు సేతుపతికి బర్త్ డే విషెస్ తెలిపారు.

Vijay Sethupathi
View this post on Instagram
ఈ క్రమంలోనే తాజాగా విజయ్ సేతుపతికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరలవుతుంది. తెల్లటి కుర్తా పైజామాలో తెల్లటి జుట్టు.. పెద్ద గడ్డంతో ఓల్డ్ ఏజ్ లుక్లో కనిపిస్తున్నాడు. విజయ్ సేతుపతి ఫోటోను కోలీవుడ్ నటి అంకితా తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్న మక్కల్ సెల్వన్ ఫోటో చూసి షాకవుతున్నారు నెటిజన్స్. విజయ్ సేతుపతి ఇలా ఎందుకు మారిపోయాడు ?.. అసలు ఏ సినిమాలో లుక్ ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.