
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించడు.. అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ పూర్తిగా అజిత్ మేనేజర్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. ఇక అజిత్ సొంతంగా మొబైల్ ఫోన్ సైతం ఉపయోగించరని మీకు తెలుసా.. ? అజిత్ బాటలోనే ఓ స్టార్ హీరో సైతం వాట్సప్, ఇన్ స్టాలకు దూరంగా ఉంటున్నారట. ఇటీవలే ఈ హీరో వాడే చిన్న ఫోన్ గురించి నెట్టింట హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అతడు మరెవరో కాదు.. పుష్ప విలన్.. మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్. తాను వాట్సాప్ కూడా ఉపయోగించనని.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు దూరంగా ఉంటానని అన్నారు.
ప్రస్తుతం తమిళం, మలయాళం, తెలుగు భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు ఫహద్ ఫాసిల్. మలయాళంలో హీరోగా మెప్పిస్తున్న ఆయన.. ఇతర భాషలలో మాత్రం వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఫహద్ ఫాసిల్ నటించిన మారీసన్ చిత్రం ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఇందులో తమిళ కమెడియన్ వడివేలు కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహద్ ఫాసిల్ తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ఇటీవల చిన్న కీప్యాడ్ ఫోన్ వాడుతూ కనిపించారు ఫహాద్. ఇదే విషయంపై ప్రశ్నించగా.. ఫహద్ మాట్లాడుతూ.. “”నేను గత ఏడాది కాలంగా స్మార్ట్‌ఫోన్ వాడటం లేదు. నేను సాధారణ బటన్ సెల్ ఫోన్‌ని ఉపయోగిస్తాను. నన్ను ఇమెయిల్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు. సోషల్ మీడియాలో కాదు. నా వ్యక్తిగత జీవితాన్ని లేదా ఫోటోలను బహిరంగంగా పంచుకోవాలనుకోవడం లేదు. నటుడిగా, నాకు స్మార్ట్‌ఫోన్ ముఖ్యం. కానీ ఇతర మార్గాలు ఉన్నాయి. నిజానికి, నేను వాట్సాప్‌లో కూడా లేను. ఇది నేటి తరం నుండి నన్ను భిన్నంగా చేస్తుందా అని మీరు నన్ను అడిగితే, నేను చెడు చిత్రాలు ఇస్తే తప్ప నేను భిన్నంగా ఉండను” అని అన్నారు. ప్రస్తుతం ఫహద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.
Fahadh Faasil Movie
ఇవి కూడా చదవండి:
Tollywood: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సోషల్ మీడియాలో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Tollywood: వారెవ్వా చిన్నది.. 22 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తుంది.. ఏకంగా మహేష్ బాబు ఫ్లాట్.. !!
Naga Chaitanya: ఆమెకే తొలి ముద్దు ఇచ్చాను.. జీవితంలో మర్చిపోలేను.. నాగచైతన్య కామెంట్స్..
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ ప్రేమాయణం.. ఇండస్ట్రీలోనే ఈ సినిమా సంచలనం..