Allu Arjun-Mahesh Babu: అల్లు అర్జున్.. మహేష్ బాబు ఇళ్లు ఎంత అందంగా ఉన్నాయో చూశారా ?.. రెండు కళ్లు చాలవు..
ఫాలోవర్లతో ముచ్చటించడమే కాకుండా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తుంటారు. అలాగే హోం టూర్స్ చూస్తే తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తెలియజేస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్స్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్స్ గడిపేస్తున్నారు. షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొరికిన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. తమ కుటుంబంతో కలిసి సరదగా గడుపుతున్న సమయాన్ని సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్లతో షేర్ చేసుకుంటున్నారు. ఇక అభిమానులు కూడా తమ ఫేవరేట్ హీరోహీరోయిన్స్ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అభిమానులకు… సెలబ్రెటీలకు మధ్య వారధిగా సోషల్ మీడియా మారింది. ఫాలోవర్లతో ముచ్చటించడమే కాకుండా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తుంటారు. అలాగే హోం టూర్స్ చూస్తే తమకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే కొందరు మాత్రమే హోంటూర్స్ చేస్తున్నారు. కానీ స్టార్ హీరోస్ అల్లు అర్జున్ (Allu Arjun).. మహేష్ బాబు (Mahesh Babu) ఇళ్లు ఎంత విశాలంగా ఉన్నాయో చూశారా ?. అయితే ఇప్పుడు చూసేద్దామా.
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రెటీలలో అల్లు అర్జున్ ఒకరు. ప్రస్తుతం బన్నీ.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. వీరి ఇంటి నిర్మాణానికి దాదాపు 100 కోట్లు ఖర్చయినట్లుగా సమాచారం. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు.. ప్రతి మూలకు సూపర్ పోష్ కలిపి ఎంతో అందంగా ఉంది. బన్నీ ఉంటున్న నివాసం దాదాపు రెండు ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా 8000 చదరపు అడుగులతో ప్రత్యేకమైన డబ్బా ఆకారపు ఫార్మ్ హౌస్ కూడా ఉంది. ఇది చూసేందుకు ఎంతో అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తోన్న పుష్ప 2 చిత్రీకరణలో పాల్గోంటున్నారు. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబంతో కలిసి మహేష్.. జూబ్లీహిల్స్‌లో నివాసముంటున్నారు. జూబ్లీహిల్స్‌లో మహేష్‌కు రూ. 28 కోట్లు విలువ చేసే మరో రెండు ఇళ్లు కూడా ఉన్నాయట. ప్రస్తుతం సూపర్ స్టార్ ఉంటున్న ఇళ్లు రాజభవనం వలె ఉంటుందట. చెక్కతో చేసిన అంతస్తులు… చుట్టూ పచ్చని వాతావరణం.. మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ మూవీ.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభంకానుంది. ఈ సినిమా తర్వాత మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.