Shah Rukh Khan: షారుఖ్ కారవాన్ చూస్తే మతిపోవాల్సిందే.. ప్రత్యేకతలు వేరేలెవల్.. ధర ఎంతంటే..

ఇండస్ట్రీలో షారుఖ్ ఖాన్ తన సినిమాలతో చాలా పేరు తెచ్చుకున్నాడు. అలాగే అతడు తన విలాసవంతమైన జీవనశైలికి కూడా ప్రసిద్ది చెందాడు. షారుఖ్ చాలా కష్టపడి పనిచేసే నటుడు. ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు షారుఖ్ కారవాన్ గురించి నెట్టింట ఓ న్యూస్ వైరలవుతుంది.

Shah Rukh Khan: షారుఖ్ కారవాన్ చూస్తే మతిపోవాల్సిందే.. ప్రత్యేకతలు వేరేలెవల్.. ధర ఎంతంటే..
Shah Rukh Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 03, 2024 | 2:42 PM

బాలీవుడ్ షారుఖ్ ఖాన్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరో.. బీటౌన్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఎన్నో హిట్ చిత్రాలతో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కోని ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రస్తుతం షారుఖ్ నెట్ వర్త్ రూ.7 వేల కోట్లకు పైగానే ఉంటుంది. సినిమాలు, నిర్మాణ రంగంలో, పలు వ్యాపారాల్లో అనేక పెట్టుబడులు పెట్టాడు. సినిమాను పూర్తి చేయడానికి ఎలాంటి రిస్క్ అయినా తీసుకుంటాడు. వర్షం, ఎండ, చలి ఏమి లెక్కచేయకుండా ఎంతో కష్టపడుతాడు. కానీ సినిమా సెట్స్ లో షారుఖ్ వ్యానిటీ వాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. షారుఖ్ వ్యానిటీ వ్యాన్ విలాసవంతమైన ఇంటి కంటే తక్కువ కాదు. షారూఖ్ ఖాన్ తన వ్యానిటీ వ్యాన్‌ను ప్రఖ్యాత ఆటో డిజైనర్ దిలీప్ ఛబ్రియా రూపొందించారు. ఈ వ్యానిటీ వ్యాన్ ధర 4 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి గ్లాస్ ఫోర్ కూడా ఉంది.

ఈ వ్యానిటీ వ్యాన్ షారుక్ ఖాన్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. మొత్తం వ్యాన్‌ను ఐప్యాడ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. వ్యాన్‌లో ప్యాంట్రీ సెక్షన్, అల్మారా, మేకప్ రూమ్, వాష్ రూమ్స్ ఉన్నాయి. వ్యాన్ లో ఎలక్ట్రిక్ చైర్ కూడా ఉంది. ఒక బటన్ పై క్లిక్ చేస్తే ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లిపోవచ్చు. ఒక ఇంటర్వ్యూలో, సిద్ధార్థ్ మల్హోత్రా షారుక్ వానిటీ వాన్ ఫీచర్ గురించి మాట్లాడాడు. షారుఖ్ వ్యాన్‌లో ఎలక్ట్రిక్ చైర్ ఉండడం వల్ల అతను చుట్టూ తిరిగేందుకు వీలు ఉంటుందని చెప్పారు.

షారుఖ్ వాడే వస్తువులపై సినీతారలు సైతం ఇష్టాన్ని పెంచుకుంటారు. గతంలో హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షారుఖ్ వస్తువులను దొంగిలించాలనుకుంటున్నట్లు తెలిపింది. షారుఖ్ వద్ద అద్భుతమైన వాచీల సేకరణ ఉంది. అలాగే షారుఖ్ మన్నత్ బంగ్లా గురించి ఎప్పుడు ఏదో న్యూస్ నెట్టింట వైరలవుతుంది.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.