AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mirai: మిరాయ్ సినిమాకు అతడికే ఎక్కువ.. స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్స్ ఎంతంటే..

ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్ అందుకున్న సినిమాల్లో మిరాయ్. యంగ్ హీరో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం అడియన్స్ ముందుకు వచ్చింది. ఉదయం నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో మిరాయ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Mirai: మిరాయ్ సినిమాకు అతడికే ఎక్కువ.. స్టార్స్ తీసుకున్న రెమ్యునరేషన్స్ ఎంతంటే..
Mirai Movie
Rajitha Chanti
|

Updated on: Sep 12, 2025 | 8:58 PM

Share

ఇటీవలే హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు తేజ సజ్జా. ఇప్పుడు మిరాయ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఇందులో మంచు మనోజ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రియ సైతం నటించారు. ఈ సినిమాలో వీరి ముగ్గురు పాత్రలే చాలా కీలకంగా ఉంటాయి. ఇందులో రితికా నాయర్ కథానాయికగా కనిపించింది. సినిమా బాగుందని.. కంటెంట్ అదిరిందని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా ఈ మూవీలోని నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్స్ గురించి ఫిల్మ్ సర్కిల్లో టాక్ నడుస్తుంది. ఇంతకీ ఎవరెవరు ఎంత తీసుకున్నారో తెలుసా.. ?

ఇవి కూడా చదవండి : Cinema : ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ షేక్ మామ.. 30 కోట్లు పెడితే 115 కోట్ల కలెక్షన్స్..

ఈ చిత్రాన్ని దాదాపు రూ.60 కోట్లతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా కోసం తేజ సజ్జా రూ.2 కోట్లు మాత్రమే తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే ఇటీవల ప్రమోషనల్లో తేజ మాట్లాడుతూ హనుమాన్ సినిమాకు తీసుకున్నంత రెమ్యునరేషన్ మాత్రమే ఈ చిత్రానికి తీసుకున్నానని అన్నారు. ఇక ఆయన నటించనున్న కొత్త సినిమాలకు దాదాపు రూ.15 కోట్లు తీసుకుంటున్నారట. అలాగే మంచు మనోజ్ ఈ మూవీకి రూ.3 కోట్లకు పైగానే పారితోషికం తీసుకున్నారట.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..

ఇక శ్రియా రూ.2 కోట్లు అందుకున్నారని టాక్. హీరోయిన్ రితిక నాయర్ రూ.50 లక్షలు పారితోషికం తీసుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో రితిక నాయర్, తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రియా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..