Animal Movie: ‘యానిమల్’లో రష్మిక కంటే ఈ బ్యూటీకే క్రేజ్ ఎక్కువ.. బోల్డ్‏గా కనిపించిన ఈ హీరోయిన్ ఎవరంటే..

మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. కబీర్ సింగ్ తర్వాత యానిమల్ సినిమాతో బీటౌన్‏లో మరోసారి తన మార్క్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ సందీప్. తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం, ఎమోషన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో రణబీర్ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ఇటు తెలుగులోనూ ఓ బాలీవుడ్ హీరో సినిమాకు ఈ రేంజ్‏లో ఓపెనింగ్ రావడం తొలిసారి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్స్ క్రియేట్ చేసింది. విడుదలకు ముందే మంచి బజ్ రాగా.. విడుదల తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చింది.

Animal Movie: 'యానిమల్'లో రష్మిక కంటే ఈ బ్యూటీకే క్రేజ్ ఎక్కువ.. బోల్డ్‏గా కనిపించిన ఈ హీరోయిన్ ఎవరంటే..
Animal Movie Tripti Dimri
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 03, 2023 | 11:47 AM

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ఖాతాలో భారీ హిట్ చేరింది. చాలా కాలం తర్వాత ‘యానిమల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పటివరకు తన ఫిల్మ్ కెరీర్‏లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా ఈ మూవీ నిలిచింది. ప్రస్తుతం ఈసినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సత్తా చాటింది. కబీర్ సింగ్ తర్వాత యానిమల్ సినిమాతో బీటౌన్‏లో మరోసారి తన మార్క్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ సందీప్. తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధం, ఎమోషన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో రణబీర్ నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ఇటు తెలుగులోనూ ఓ బాలీవుడ్ హీరో సినిమాకు ఈ రేంజ్‏లో ఓపెనింగ్ రావడం తొలిసారి. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డ్స్ క్రియేట్ చేసింది. విడుదలకు ముందే మంచి బజ్ రాగా.. విడుదల తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చింది. అప్పటివరకు అడియన్స్ ఊహించనిదానికంటే ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఈ సినిమాలో రణబీర్ తండ్రిగా అనిల్ కపూర్ నటించగా.. విలన్ పాత్రలో బాబీ డియోల్ నటించాడు. ఇక ఇందులో రణబీర్ జోడిగా నేషనల్ క్రష్ రష్మిక నటించింది. ఇందులో లిప్ లాక్స్, బోల్డ్ సీన్స్ ఎక్కువగానే ఉన్నాయంటున్నారు నెటిజన్స్. అయితే ఇప్పుడు ఈ మూవీలో రష్మిక కంటే ఎక్కువగా ఓ బ్యూటీకి క్రేజ్ వచ్చేస్తోంది. ఇప్పుడు అందరి చూపు ఆ నటి మీదే ఉండగా.. ఆ బ్యూటీ ఎవరో తెలుసుకోవడానికి నెట్టింటిని జల్లెడ పట్టేస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ ట్రెండింగ్ లో ఈ బ్యూటీ పేరు మారుమోగుతుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు ? రష్మిక కంటే ఎక్కువ క్రేజ్ ఎందుకు వచ్చిందో ? ఆరా తీస్తున్నారు.

యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ తో బోల్డ్ సీన్లలో నటించిన హీరోయిన్ త్రిప్తి డిమ్రీ. ఈ మూవీలో ఈ బ్యూటీ ఎక్కువగా బోల్డ్ సీన్లలో కనిపించింది. దీంతో ఈ హీరోయిన్ ఎవరని నెటిజన్స్ వెతుకున్నారు. త్రిప్తి డిమ్రీ.. బాలీవుడ్ బ్యూటీ. మోడలింగ్ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టింది. బుల్లితెరపై పలు యాడ్స్ చేసింది. సంతూర్ సోప్ యాడ్ లో నటించింది. 2017లో శ్రీదేవి మామ్ అనే సినిమాలో ఓ కీలకపాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పోస్టర్ బాయ్స్ సినిమాలో కథానాయికగా నటించింది. అలాగే బాలీవుడ్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు యానిమల్ సినిమాతో ఈ బ్యూటీకి క్రేజ్ ఎక్కువగా వచ్చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా నందిలో నాగు పాము హల్ చల్.. ఓ ఇంట్లోకి దూరి ఇలా..
మహా నందిలో నాగు పాము హల్ చల్.. ఓ ఇంట్లోకి దూరి ఇలా..
ట్రంప్ గెలుపునకు ముందు క్షిపణి పరీక్ష! ఆలస్యంగా వెలుగులోకి వీడియో
ట్రంప్ గెలుపునకు ముందు క్షిపణి పరీక్ష! ఆలస్యంగా వెలుగులోకి వీడియో
ఐఫాలో రానా, తేజ సెటైర్లు.. హైదరాబాద్‌లో మంటలు.! అసలేం జరిగింది.?
ఐఫాలో రానా, తేజ సెటైర్లు.. హైదరాబాద్‌లో మంటలు.! అసలేం జరిగింది.?
మహిళలు లంగా నాడాను బిగించి కట్టడం వల్ల పెట్టీకోట్‌ క్యాన్సర్‌..!
మహిళలు లంగా నాడాను బిగించి కట్టడం వల్ల పెట్టీకోట్‌ క్యాన్సర్‌..!
యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌.! అధికారుల ప్రకటన..
యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌.! అధికారుల ప్రకటన..
ట్రంప్‌ మా నాన్న.. పాక్‌ యువతి వాదన.! వీడియో మళ్లీ వైరల్‌..
ట్రంప్‌ మా నాన్న.. పాక్‌ యువతి వాదన.! వీడియో మళ్లీ వైరల్‌..
50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్‌.. ఏం జరిగిందంటే.?
50 మంది ప్రాణాలు కాపాడిన కండక్టర్‌.. ఏం జరిగిందంటే.?
ట్రంప్‌ ఎఫెక్ట్‌.! తగ్గుతున్న బంగారం, వెండిధరలు.. ఇదే మొదటిసారి.!
ట్రంప్‌ ఎఫెక్ట్‌.! తగ్గుతున్న బంగారం, వెండిధరలు.. ఇదే మొదటిసారి.!
విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఏటా 22లక్షల మందికి లబ్ది.
విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఏటా 22లక్షల మందికి లబ్ది.
ఎమ్మెల్యేలు ఫైటింగ్.. రణరంగంలా జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ.! వీడియో..
ఎమ్మెల్యేలు ఫైటింగ్.. రణరంగంలా జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ.! వీడియో..