Geetha Singh: మూవీ ఆఫర్స్ లేవు.. నమ్మినవాళ్లే మోసం చేశారు.. చనిపోదామని సూసైడ్ ట్రై చేశా.. కితకితలు హీరోయిన్..
తెలుగు సినిమా ప్రపంచంలో లేడీ కమెడియన్స్ చాలా తక్కువ. తమ నటనతో, కామెడీ టైమింగ్ తో మెప్పించి.. ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో గీతా సింగ్ ఒకరు. కమెడియన్ గానే కాదు.. ఆమె హీరోయిన్ గానూ మెప్పించింది. ఒకప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన గీతా సింగ్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు గీతా సింగ్. ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేడీ కమెడియన్లలో ఆమె ఒకరు. తెలుగులో అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే అప్పట్లో చాలా సినిమాల్లో నటించిన గీతా.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమైన ఆమె.. ఇటీవల బుల్లితెరపై పలు షోలలో సందడి చేశారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో గీతా సింగ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన ఆమె.. జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారట. రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశానని అన్నారు. అమ్మా, నాన్న అందరూ చనిపోయారని.. చీటీ కట్టి 22 లక్షల వరకు మోసపోయానని ఎమోషనల్ అయ్యారు. రోజూ ఒక్కొక్క రూపాయి దాచుకుని వాళ్లకు ఇచ్చానని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
తను అసలు నటిగా కెరీర్ ప్రారంభించలేదని, దర్శకులు తేజ, ఈవీవీ సత్యనారాయణ గారి ప్రోత్సాహం, శిక్షణతోనే ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. కితకితలు చిత్రం కోసం బరువు పెరిగానని, అది అప్పట్లో తన కెరీర్‌కు సానుకూలంగా మారినా.. ఆ తర్వాత జీవితాన్ని మార్చిందని అన్నారు. కితకితలు సినిమాను కేవలం 80 లక్షల బడ్జెట్‌తో నిర్మించగా, అప్పట్లోనే దాని శాటిలైట్ హక్కులను 8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని అన్నారు. గీతా సింగ్ తన వ్యక్తిగత జీవితంలోని విషాదాలను కూడా వెల్లడించారు.
తన చిన్నతనం నుండి మేనత్త పెంపకంలో పెరిగానని, ఆమె మరణం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. తన మేనత్త మరణం తర్వాత దాదాపు ఒక సంవత్సరం పాటు సాధారణ మనిషిగా ఉండలేకపోయానని.. తన తండ్రి, సోదరుడు కూడా మరణించారని, తన కుటుంబ బాధ్యతలన్నీ తనపైనే ఉన్నాయని అన్నారు.. సొంత వ్యక్తుల నుండే చాలా మోసాలు ఎదుర్కొన్నానని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. తెరపై ప్రేక్షకులను నవ్వించినా, తెర వెనుక తనలో ఎంతో బాధ దాగి ఉందని ఆమె వెల్లడించారు. ఈ బాధను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
ఒక హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తన కెరీర్‌లో అన్ని కోణాలను చూపించానని గీతా సింగ్ తెలిపారు. జబర్దస్త్ లాంటి కామెడీ షోలలో అవకాశాలు వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే నిర్మాతలు పూర్తి స్థాయి అవకాశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నాలుగు లేదా ఆరు ఎపిసోడ్‌లకే పరిమితం చేసి, తర్వాత పిలవడం లేదని, రెమ్యూనరేషన్ తగ్గించుకున్నా కూడా నిలకడైన అవకాశాలు ఉండటం లేదని చెప్పారు. శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మంచి బ్యానర్‌లలో పని చేసినా, కొనసాగడానికి అవకాశం లభించడం లేదన్నారు. హిందీలో భారతి సింగ్ వంటి వారికి ఇచ్చినట్లుగా, తమలాంటి కమెడియన్లను కూడా ప్రోత్సహించాలని, యాంకర్లతో పాటు కమెడియన్లతో కూడా షోలను ప్లాన్ చేయాలని ఆమె కోరారు. ఇందుకు సంబంధించి తాను స్వయంగా ప్రపోజల్ పెట్టడానికి కూడా ఆలోచిస్తున్నానని గీతా సింగ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..




