Kingdom: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన కింగ్‌డమ్ టీమ్.. బెస్ట్ విషెస్ తెలిపిన పవర్ స్టార్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Kingdom: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన కింగ్‌డమ్ టీమ్.. బెస్ట్ విషెస్ తెలిపిన పవర్ స్టార్
Kingdom Team, Pawan Kalyan

Updated on: Jul 30, 2025 | 8:22 PM

విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా రేపు (జులై 31)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా కింగ్ డమ్ మూవీ టీమ్ పవన్ కళ్యాణ్ ను కలిశారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కింగ్ డమ్ మూవీ టీమ్ కలిశారు. హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్‌లో పవన్ కళ్యాణ్ ను విజయ్ దేవరకొండ  హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగ వంశీ కలిశారు. విజయ్ దేవరకొండకు చిత్రయూనిట్ కు పవన్ తన బెస్ట్ విషెస్ తెలిపారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలే హరిహరవీరమల్లు సినిమాతో పేక్షకులను పలకరించిన పవన్ ఇప్పుడు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో రానున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక కింగ్ డమ్ సినిమా విషయానికొస్తే.. సోమవారం(జూలై 26) హైదరాబాద్ లోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌ లో ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. అలాగే కింగ్ డమ్ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.