KGF Chapter 2: రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న రాకీభాయ్.. మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 సంచలనం.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కేజీఎఫ్ 2 (KGF 2) సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) అద్భుతమైన నటనకు..

ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కేజీఎఫ్ 2 (KGF 2) సినిమా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ (Yash) అద్భుతమైన నటనకు.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి ప్రేక్షకులు.. సెలబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సిక్వెల్‍గా వచ్చిన కేజీఎఫ్ 2 అంతకు మించి అన్నట్టుగా థియేటర్లలో దూసుకుపోతుంది. విడుదలకు ముందే ప్రీ బుకింగ్స్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఇక ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ 2 మొదటి రోజే రూ. 130 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అంటే… ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది. కేజీఎఫ్ హిందీ వెర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 50 కోట్ల మార్క్ క్రాస్ చేసినట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అలాగే.. తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్ 2 మూవీ రూ. 33 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళలో మొత్తం కలిపి రూ. 50 కోట్లు వసూలు చేసిందట. మొత్తానికి దేశవ్యా్ప్తంగా కేజీఎఫ్ 2 కలెక్షన్స్ రూ. 150 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో సంజయ్ దత్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, రవినా టాండన్, శ్రీనిధి శెట్టి కీలకపాత్రలలో నటించారు. గరుడను చంపిన రాకీభాయ్‌గా, ఫస్ట్ పార్ట్ లో చూపించిన సేమ్ మేనరిజమ్, సేమ్ డైలాగ్ డెలివరీతో మాస్‌లో ఫైర్ పుట్టించే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు యష్. ఆయన గడ్డం, హెయిర్ స్టైల్, కోటు వేసుకున్న విధానం, తలకు గుడ్డకట్టుకునే తీరు, యాక్షన్ సీన్స్ లో అతను విజృంభించిన విధానం, జనాలతో పాటు కలిసిపోయి పనిచేసే సన్నివేశాల్లో చూపించిన ఈజ్ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టిస్తున్నాయి.
If Premieres are reported separately for #KGFChapter2 for Wed – Apr 13th, it would have debuted at No.3 in #USA Box Office..
— Ramesh Bala (@rameshlaus) April 15, 2022
#HombaleFilms have arrived with a bang with #KGF2… The production house – a hugely respected and successful entity in #Kannada film industry – has made a big splash globally with #KGFChapter2… Kudos to #VijayKiragandur for steering the company to dizzy heights of success. pic.twitter.com/oJux4OTXuY
— taran adarsh (@taran_adarsh) April 14, 2022
Also Read: suriya: తమిళ నూతన సంవత్సరం వేళ సరికొత్తగా సూర్య.. అభిమానులకు అలా విషెస్ చెబుతూ..
Simbu: ఆటో డ్రైవర్‌గా మారిన ఆ స్టార్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోస్..
PM Kisan: రైతులకు అలర్ట్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.. పీఎం కిసాన్ పథకానికి ఇక వీరు అనర్హులు..
Sunny Leone: సన్నీలియోన్ ఫాన్స్‌కు బంపర్ ఆఫర్.. క్రేజీ ఐడియా.. కానీ కండిషన్స్ అప్లై..




