క్యాన్సర్‌తో పోరాడుతున్న కేజీఎఫ్ నటుడు.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు..

కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ 2 కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో యశ్ తన నటనతో ఆకట్టుకున్నాడు.

క్యాన్సర్‌తో పోరాడుతున్న కేజీఎఫ్ నటుడు.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపులు..
Kgf

Updated on: Sep 01, 2025 | 2:53 PM

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వరుసగా విషాదాలు జరుగుతున్నాయి. కొంతమంది నటీ నటులు అనారోగ్యంతో కన్నుమూస్తుంటే మరికొంతమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది నటీ నటులు అనారోగ్యానికి గురై ఆర్ధిక సాయం కోసం ఎదురుచూస్తుంటారు. అవకాశాలు తగ్గి, అనారోగ్యం బారిన పడతంతో చేతుల్లో డబ్బులు లేక సినిమా పెద్దలు సాయం చేస్తారేమో అని ఎదురుచూస్తున్నవారు చాలా మందే ఉన్నారు. తాజాగా ఓ ప్రముఖ నటుడు కూడా క్యాన్సర్ బారిన పడి సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతకూ అతను ఎవరో కాదు.. కేజీఎఫ్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు ఆయన. ఆయన పేరు హరీష్ రాయ్.

అమ్మబాబోయ్..! సునీల్ హీరోయిన్ ఎంత మారిపోయింది..!! చూస్తే షాక్ అవ్వాల్సిందే

కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. కన్నడ భాషలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమాలో హరీష్ రాయ్ కీలక పాత్రలో నటించాడు.. ఈ సినిమా హీరోకు ఆయన ఇచ్చే ఎలివేషన్ సినిమాకే హైలైట్ అనే చెప్పాలి. అయితే ఆయన గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హరీష్ రాయ్ థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఆహా.. ఎన్నాళ్లకు కనిపించింది..! రణం బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఇటీవల ఆయన మాట్లాడుతూ.. తాను థైరాయిడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నట్టు తెలిపాడు. ఆయనకు వైద్యం చేయించడానికి రూ. 70లక్షలు ఖర్చవుతుంది వైద్యులు తెలిపారు. ఒక్కొక్క ఇంజక్షన్ ఖరీదు రూ.3.5 లక్షలు అవుతుందని తెలిపాడు. ఒక సైకిల్ కి మూడు ఇంజక్షన్లు తీసుకోవాలి.. అంటే ఒక్క సైకిల్‌కు రూ.10.5 లక్షలు అవుతుంది. 17 నుండి 20 ఇంజక్షన్లు  తీసుకోవాలి. ఇందుకోసం రూ. 70లక్షలు ఖర్చవుతుందని తెలిపాడు హరీష్ రాయ్. చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలి అని కోరుతున్నాడు హరీష్ రాయ్. ఇప్పటికే హరీష్ రాయ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.

నోరు జాగ్రత్త..! హీరో యశ్ తల్లి హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి