Ketika Sharma: ఆ సాంగ్ వివాదం వల్ల నేను ఓ విషయం నేర్చుకున్నా.. కేతిక శర్మ క్రేజీ కామెంట్స్
ఆకాష్ పురిగా హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది ముద్దుగుమ్మ కేతిక శర్మ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత లక్ష్య అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆతర్వాత వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో చేసింది.

కేతిక శర్మ.. ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా దూసుకుపోతుంది ఈ చిన్నది. ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది అందాల భామ కేతిక శర్మ. తొలి సినిమాలోనే తన గ్లామర్ తో కట్టిపడేసింది ఈ అందాల భామ. ఈ బ్యూటీ అందానికి, క్యూట్ నెస్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే రొమాంటిక్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు కూడా పెద్దగా బాక్సాఫిస్ దగ్గర ప్రభావం చూపలేకపోయాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలోనూ నటించి మెప్పించింది.
ఇక ఇప్పుడు సింగిల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరక్కింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే సినిమాలో మరో హీరోయిన్ గా ఇవానా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కేతిక మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. సింగిల్ సినిమాలో తన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను అని తెలిపింది. ఎందుకంటే కామెడీ పండించడం అంత తేలిక కాదు.. పైగా శ్రీవిష్ణు కామెడీ టైమింగ్ కు మ్యాచ్ అయ్యేలా కామెడీ చేయడం చాలా కష్టం అని తెలిపింది.
అలాగే ముఖ్యంగా ఇంట్రవెల్ సీన్ నాకు చాలా ఛాలెంజింగ్ గా ఉంది.. ఆ సీన్ లో కడుపుబ్బా నవ్వుతారు. దర్శకుడు సీన్స్ చాలా హాస్యభరితంగా రాశారు అని తెలిపింది. ఇక రాబిన్ హుడ్ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ గురించి మాట్లాడుతూ.. అదిదా సర్‌ప్రైజ్ కు ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ సూపర్. అయితే ఆ సాంగ్ వివాదం వల్ల నేను ఓ విషయం నేర్చుకున్నా.. ఇక పై డాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటా.. ముఖ్యంగా స్టెప్పులా విషయంలో ఇక పై అలా జరగకుండా చూసుకుంటా అని తెలిపింది కేతిక. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.