AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good Luck Sakhi : కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడో తెలుసా..

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ టైటిల్‌ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ `గుడ్ లక్ సఖి` ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషిస్తున్న ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Good Luck Sakhi : కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడో తెలుసా..
Keerthy Suresh
Rajeev Rayala
|

Updated on: Nov 03, 2021 | 8:57 AM

Share

Good Luck Sakhi: నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ టైటిల్‌ పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ `గుడ్ లక్ సఖి` ఆది పినిశెట్టి మేల్ లీడ్ పోషిస్తున్న ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యుల బృందంతో ఈ చిత్రం రూపొందుతోంది.

కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో సినిమాను నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో కీర్తి సురేష్ తన టార్గెట్‌కు గురిపెట్టినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ఆ పోస్టర్‌లో ఆది పినిశెట్టి, జగపతి బాబు కూడా కనిపిస్తున్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న `గుడ్ లక్ సఖి` సినిమాని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండ‌గా చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, ఇతర ప్రమోషనల్ వీడియోలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Allu arjun family: అర్హ.. అయాన్‏తో కలిసి బన్నీ సతీమణి స్నేహ అల్లరి .. బ్రష్ చేతబట్టి పెయింటింగ్స్ వేస్తూ..(ఫొటోస్)

Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలు.. ఈ సీసీ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు..

Krithi Shetty Photos: కొత్త అందాలతో ఆకట్టుకుంటున్న ‘కృతి శెట్టి’.. దేవకన్య అంటూ కామెంట్స్..(ఫొటోస్)