AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: లావెండర్ కలర్ చీరలో మెరిసిన కీర్తి.. ముత్యాల నగలతో ముస్తాబయిన అందం..

తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో చిత్రాల్లో నటించిన కీర్తి..ఇటీవలే భోళా శంకర్ మూవీలో కనిపించింది. ఇందులో చిరు చెల్లిగా నటించింది కీర్తి. సినిమాలు మాత్రమే కాకుండా.. ఫ్యాషన్ రంగంలోనూ కీర్తి స్టైల్ ప్రత్యేకం. ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్‏కు తగినట్టుగా సంప్రదాయ దుస్తులకు ట్రెండీ లుక్ ఇవ్వడంలోనూ కీర్తి స్టైల్ వేరు. ప్రతి పండగకు కీర్తి సరికొత్త సంప్రదాయ ఫ్యాషన్ లుక్ లో కీర్తి ముందుంటుంది. ఇక చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ ఐడియాకు ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Keerthy Suresh: లావెండర్ కలర్ చీరలో మెరిసిన కీర్తి.. ముత్యాల నగలతో ముస్తాబయిన అందం..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: Sep 06, 2023 | 4:21 PM

Share

దక్షిణాది సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు కీర్తి సురేష్. నేను శైలజ అంటూ తెలుగు అడియన్స్ ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత మహానటి సినిమాతో అలనాటి హీరోయిన్ సావిత్రిని మైమరపించింది. ఈ మూవీలో తన నటనతో ఏకంగా ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో చిత్రాల్లో నటించిన కీర్తి..ఇటీవలే భోళా శంకర్ మూవీలో కనిపించింది. ఇందులో చిరు చెల్లిగా నటించింది కీర్తి. సినిమాలు మాత్రమే కాకుండా.. ఫ్యాషన్ రంగంలోనూ కీర్తి స్టైల్ ప్రత్యేకం. ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్‏కు తగినట్టుగా సంప్రదాయ దుస్తులకు ట్రెండీ లుక్ ఇవ్వడంలోనూ కీర్తి స్టైల్ వేరు. ప్రతి పండగకు కీర్తి సరికొత్త సంప్రదాయ ఫ్యాషన్ లుక్ లో కీర్తి ముందుంటుంది. ఇక చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ ఐడియాకు ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నటి మోనికా, నిధి డిజైన్స్ నుంచి అందమైన లెహంగాను ధరించింది. త్రీ-పీస్ సెట్‌లో హై వెయిస్ట్ లెహంగా ఉంది. ఆమె స్ట్రాప్ లెస్ బ్లౌజ్, మ్యాచింగ్ దుపట్టాతో జత చేసింది. దానిని చీర డ్రెప్ స్టైల్లో రూపొందించింది. షిమ్మర్ షిఫాన్ ఫాబ్రిక్.. దుస్తులు దానికి సీక్విన్ ఎంబ్రాయిడరీని హైలెట్ చేసింది. లావెండర్ లెహాంగాలో కీర్తి షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి చూపును ఆకర్షిస్తున్నాయి.

లావెండర్ లవ్ అంటూ క్యాప్షన్ ఇస్తూ కీర్తి షేర్ చేసిన ఫోటోస్ ఫాలోవర్లను కట్టిపడేస్తున్నాయి. షిమ్మర్ షిఫాన్ ఫాబ్రిక్ దస్తులకు ముత్యాల ఆభరణాలు ధరించి తన లుక్ ను మరింత స్పెషల్ చేసింది కీర్తి. ప్రస్తుతం ఆమె న్యూలుక్ దేవకన్యను తలపిస్తోంది. కీర్తి పంచుకున్న బ్యూటీఫుల్ ఫోటోస్ ఒకసారి మీరు చూసేయ్యండి.

ఇవి కూడా చదవండి

అంతకు ముందు పాస్టెల్ హ్యూడ్ లెహంగాలో కుందనపు బొమ్మగా కనిపించింది. ప్రింటెడ్ లెహంగాను హెవీ డ్యూటీ ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ తో జత చేసింది. ఇందులో ఆమె న్యూలుక్ మరింత అద్భుతంగా ఉందనే చెప్పుకొవాలి.

ఈ ఫ్యాషన్ ప్రపంచంలో కీర్తి ఎప్పుడూ తన కొత్త రూపంతో ముందుంటుంది. ట్రెండీ శారీలోనే కాదు.. లెహాంగాలతోపాటు.. సంప్రదాయ చీరకట్టులోనూ కీర్తి అద్బుతమే. ఇటీవల ఓనమ్ పండగ సందర్భంగా కసవు చీరలో కనిపించింది. గోల్డెన్ డిటైలింగ్ తో కూడిన ఈ ఐవరీ చీరను ధరించి.. బంగారు ఝుంకాలు, గాజులతో ట్రెడీషన్ లో లుక్ మెస్మరైజ్ చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.