Keerthy Suresh: ఆ బార్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదట.. కానీ ఆ ఛాన్స్ మిస్ అవుతుందని అలా చేసిందట కీర్తి

నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ కీర్తిసురేష్. ఆ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Keerthy Suresh: ఆ బార్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదట..  కానీ ఆ ఛాన్స్ మిస్ అవుతుందని అలా చేసిందట కీర్తి
Keerthysuresh
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 04, 2023 | 8:00 AM

ఒకే ఒక్క సినిమా కీర్తిసురేష్ తెలుగు ప్రేక్షకుల కు దగ్గరయింది. ఇప్పుడు ఒకేఒక్క సినిమాతో తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకుంది ఈ చిన్నది. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ కీర్తిసురేష్. ఆ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాతో మంచి విజయాన్ని అందుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మహానటి సినిమాలో సావిత్రి గారి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఆ తర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ యంగ్ హీరోలతో సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సరసన కూడా ఛాన్స్ లు అందుకుంది. తాజాగా కీర్తి నటించిన దసరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో కీర్తి డీ గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది.

శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని మాస్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. సినిమాలో నాని నటన, కీర్తిసురేష్ పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నది తెలుస్తోంది.

ఇక చాలా కాలం తర్వాత కీర్తి బిగ్ హిట్ అందుకుంది. దాంతో ఈ అమ్మడు ఆనందంలో తేలిపోతోంది. ఇక దసరా సినిమాలో సిల్క్ బార్ చుట్టూ తిరుగుతుంది. తాజాగా కీర్తిసురేష్ ఆ సిల్క్ బార్ దగ్గర సిల్క్ స్మిత ఫోజ్ ఉన్న ఫోటోను షేర్ చేసింది. సిల్క్ బార్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ ఫోటో దిగింది ఈ భామ. దీనికి సిల్క్‌ బార్‌ సెట్‌ను తొలగించే ముందు తాను దాని ముందు ఫోటోలు దిగాను. అంతే కానీ ఆ బార్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది కీర్తి.