Keerthy Suresh: చెల్లెలి పాత్రకు కేరాఫ్‌గా ఈ అమ్మడు మారిపోతుందా..? అభిమానుల్లో ఆందోళన..

కీర్తి సురేష్..! ఓ వైపు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో... మరో వైపు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవితో.. సినిమా ఛాన్స్‌ కొట్టేసి టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీస్‌గా నిలిచారు.

Keerthy Suresh: చెల్లెలి పాత్రకు కేరాఫ్‌గా ఈ అమ్మడు మారిపోతుందా..? అభిమానుల్లో ఆందోళన..
ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో అలాగే చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది.
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 29, 2021 | 9:29 PM

Keerthy Suresh: కీర్తి సురేష్..! ఓ వైపు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో… మరో వైపు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవితో.. సినిమా ఛాన్స్‌ కొట్టేసి టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీస్‌గా నిలిచారు. ఇద్దరు లెజెండ్స్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకుని లక్కీ గార్ల్‌గా అందరి చేత అనిపించుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉంటే .. ఈ బ్యూటీ ఈ ఇద్దరు బిగ్‌ స్టార్స్‌కు చెల్లి గా నటించడం ఇప్పుడో ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా మారింది. అన్నాత్తే సినిమాలో రజినీ చెల్లెలుగా అదరగొట్టిన ఈ బ్యూటీ… తాజాగా చిరు లేటెస్ట్ మూవీ భోళా శంకర్‌‌లోనూ.. చెల్లి క్యారెక్టర్‌ కే పరిమితమైంది.

అయితే ఈ విషయంగానే కాస్త ఆందోళన చెందుతున్నారు కీర్తి హార్డ్‌ కోర్ ఫ్యాన్స్‌. కెరీర్‌లో ఇప్పటి వరకు డిఫరెంట్ రోల్స్‌ చేసిన కీర్తి ఓకే టైపు రోల్స్‌ చేయడాన్ని వారు అంతగా వారు జీర్ణించుకోలేక పోతున్నారు. చిరు భోళా శంకర్,… తమిళ వేదాలం సినిమాకు రిమేక్ కావడం.. ఆ సినిమాను అన్నాత్తే డైరెక్టర్‌ శివనే డైరెక్టర్‌ చేయడంతో… ఈ రోల్స్‌ ఇంచు మించు ఒకేలా ఉంటాయని.. వారు ఫీలవుతున్నారు. ఇలా ఓకే టైపు క్యారెక్టర్స్‌ చేస్తే..,. కెరీర్ గాడి తప్పే అవకాశాలు ఉంటాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఇక మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఏంటి కీర్తి చెల్లెకు కేరాఫ్‌‌గా మారిపోతున్నావ్‌ ఏంటి? అంటూ మీమ్స్‌ అండ్ కమెంట్స్‌‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… వాటిని వైరల్ చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Puneeth Rajkumar: గుండెపోటుతోనే మరణించిన పునీత్ తండ్రి.. అతడి సోదరుడికి కూడా గతంలో హార్ట్ ఎటాక్

RRR Movie : “ఆర్ఆర్ఆర్” అప్డేట్.. గ్లింప్స్ రిలీజ్‌ను వాయిదా వేసిన మేకర్స్.. కారణం ఇదేనా..

Puneeth Rajkumar Death: ఇది చనిపోవాల్సిన వయసు కాదు.. పునీత్ మరణం పై ప్రధాని మోడీ ట్వీట్.