Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: సినిమా ఆడకపోతే నేరమా? చిరంజీవిని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం చాలా బాధేస్తోంది: కార్తికేయ

భోళాశంకర్‌ సక్సెస్‌ కాకపోవడంతో భారీ నష్టాలు వచ్చాయని మెగాస్టార్‌కు, నిర్మాతకు గొడవలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. అలాగే కొన్ని రోజుల పాటు మెగాస్టార్‌ సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకోనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ చిరంజీవిపై ట్రోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఎక్స్‌ 100 సినిమా ఫేమ్, యంగ్‌ హీరో కార్తికేయ చిరంజీవిపై వస్తోన్న విమర్శలపై స్పందించాడు. మెగాస్టార్‌ను ట్రోల్ చేస్తున్న వారిది చిన్న పిల్లల మనస్తత్వమంటూ కౌంటర్‌ ఇచ్చాడు

Chiranjeevi: సినిమా ఆడకపోతే నేరమా? చిరంజీవిని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం చాలా బాధేస్తోంది: కార్తికేయ
Kartikeya, Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Aug 20, 2023 | 8:01 AM

‘వాల్తేరు వీరయ్య’ తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు ‘భోళాశంకర్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 11న విడుదలైన ఈ మెగా మాస్‌ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఫెయిల్యూర్‌గా నిలవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలోనూ వివిధ రకాల ప్రచారాలు, పుకార్లు వినిపిస్తున్నా. భోళాశంకర్‌ సక్సెస్‌ కాకపోవడంతో భారీ నష్టాలు వచ్చాయని మెగాస్టార్‌కు, నిర్మాతకు గొడవలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. అలాగే కొన్ని రోజుల పాటు మెగాస్టార్‌ సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకోనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ చిరంజీవిపై ట్రోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్‌ఎక్స్‌ 100 సినిమా ఫేమ్, యంగ్‌ హీరో కార్తికేయ చిరంజీవిపై వస్తోన్న విమర్శలపై స్పందించాడు. మెగాస్టార్‌ను ట్రోల్ చేస్తున్న వారిది చిన్న పిల్లల మనస్తత్వమంటూ కౌంటర్‌ ఇచ్చాడు. ‘చిరంజీవిని చాలామంది పలు రకాలుగా విమర్శిస్తూ ఉంటారు. అలా ఆయనను ఎవరైనా విమర్శిస్తే నాకు చాలా బాధేస్తుంది. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఏదైనా సినిమా నచ్చలేదు, బాగోలేదు అని అనడం వరకు ఓకే గానీ.. కొంతమంది పనికట్టుకుని పర్సనల్‌గా చిరంజీవిని టార్గెట్‌ చేసి తిడుతున్నారు. అలాంటివారిది చిన్న పిల్లల మనస్తత్వం’ అని కార్తికేయ తెలిపారు.

‘చిరంజీవైనా, ఎవరైనా కథ నచ్చితేనే సినిమా చేస్తాం. ఒక్కోసారి మన అంచనాలు తప్పుతాయి. అనుకున్నంత స్థాయిలో సినిమా ఆడకపోతే నేరమా? చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని నిలబడ్డారు. జీవితంలో ఆయన చూసిన ఒడిదొడుకుల ముందు ఇది చాలా చిన్న విషయం మాత్రమే. ఇలాంటి విమర్శలకు చిరంజీవి ఏ మాత్రం ఫీలవ్వరని ఆశిస్తున్నా. త్వరలోనే మరో మంచి సూపర్‌హిట్ సినిమాతో మన ముందుకు వస్తారని అందరికీ తెలుసు’ అని చిరంజీవిపై అభిమానాన్ని చాటుకున్నారు కార్తికేయ. కాగా ఆర్‌ ఎక్స్‌ 100 తర్వాత ఆ స్థాయి విజయం కోసం ఎదురుచూస్తున్నాడీ యంగ్‌ హీరో. త్వరలోనే బెదురులంక 2012 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యుగాంతం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్‌గా నటించింది. తాజాగా ఈ బెదురులంక ట్రైలర్‌ను మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఆవిష్కరించి సినిమా యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ సందర్భంగానే చిరంజీవిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు కార్తికేయ. ఆగస్టు 25న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

కార్తికేయ, చిరంజీవి

View this post on Instagram

A post shared by Kartikeya (@actorkartikeya)

కార్తికేయ, రామ్ చరణ్

View this post on Instagram

A post shared by Kartikeya (@actorkartikeya)

ధోని ఎంట్రీతో గర్జించిన చెపాక్.. 120 డెసిబెల్ మోత!
ధోని ఎంట్రీతో గర్జించిన చెపాక్.. 120 డెసిబెల్ మోత!
ధ్యావుడా.. ఓర్రీ మేనేజర్ టాలీవుడ్ స్టార్ హీరోయినా.. ?
ధ్యావుడా.. ఓర్రీ మేనేజర్ టాలీవుడ్ స్టార్ హీరోయినా.. ?
ఔరంగజేబు ఆక్రమణదారుడే! టీవీ9 సమ్మిట్‌లో RSS నేత సునీల్‌ అంబేకర్‌
ఔరంగజేబు ఆక్రమణదారుడే! టీవీ9 సమ్మిట్‌లో RSS నేత సునీల్‌ అంబేకర్‌
వేసవిలో స్టైలిష్‌గా కనిపించడానికి బూట్లు ధరిస్తున్నారా.. జాగ్రత్త
వేసవిలో స్టైలిష్‌గా కనిపించడానికి బూట్లు ధరిస్తున్నారా.. జాగ్రత్త
రూ.వంద కింద పడేసి.. లక్షన్నర ఎత్తుకెళ్లిన దొంగల ముఠా! వీడియో
రూ.వంద కింద పడేసి.. లక్షన్నర ఎత్తుకెళ్లిన దొంగల ముఠా! వీడియో
మహిరాట్ హగ్ వైరల్! ధోని, కోహ్లీ స్పెషల్ మూమెంట్ హైలైట్!
మహిరాట్ హగ్ వైరల్! ధోని, కోహ్లీ స్పెషల్ మూమెంట్ హైలైట్!
భారతదేశం వెలుపల ఉన్న ప్రసిద్ధ శివాలయాలు.. ఎక్కడంటే..
భారతదేశం వెలుపల ఉన్న ప్రసిద్ధ శివాలయాలు.. ఎక్కడంటే..
దౌత్య సంబంధాలతో విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు విముక్తి!
దౌత్య సంబంధాలతో విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు విముక్తి!
స్టార్ హీరో సినిమాకు షాక్.. విడుదలైన గంటల్లోనే HD ప్రింట్ లీక్..
స్టార్ హీరో సినిమాకు షాక్.. విడుదలైన గంటల్లోనే HD ప్రింట్ లీక్..
ఓరి దేవుడా.. మయన్మార్‌లో మళ్లీ భూకంపం! వరుసగా మూడోసారి.. వీడియో
ఓరి దేవుడా.. మయన్మార్‌లో మళ్లీ భూకంపం! వరుసగా మూడోసారి.. వీడియో