Kartik Aaryan: హాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్‌.. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌‌లో కీ రోల్.. స్పందించిన హీరో

మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌ నెక్ట్స్ మూవీలోనే కార్తీక్‌ ఆర్యనే హీరోగా నటిస్తున్నారన్న వార్తను ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్రెండ్స్‌పై కార్తీక్‌ ఆర్యన్ కూడా స్పందించారు.

Kartik Aaryan: హాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్‌.. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌‌లో కీ రోల్.. స్పందించిన హీరో
Kartik Aaryan
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 05, 2022 | 10:04 AM

ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ డిపెండబుల్ అనిపించుకుంటున్నారు బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌. ఆల్రెడీ థియేట్రికల్‌ రిలీజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌ ఇచ్చిన కార్తీక్‌ క్లాసిక్‌ సినిమాల సీక్వెల్స్‌తో హల్‌చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ క్రేజీ హాలీవుడ్ మూవీలోనూ కార్తీక్‌ నటిస్తున్నారన్న న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ హీరో కెరీర్‌ క్లైమాక్స్‌కి వచ్చేసినట్టే అనుకుంటున్న టైమ్‌లో భూల్‌ బులయ్యా 2 సక్సెస్‌తో బౌన్స్ బ్యాక్ అయ్యారు యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్. తాజాగా డిజిటల్ రిలీజ్ అయిన ఫ్రెడ్డీ కూడా కార్తీక్ ఖాతాలో మరో హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావటం.. ముఖ్యం కార్తీక్‌ నటనకు స్పెషల్ అప్లాజ్‌ వస్తుండటంతో ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.

వరుస సక్సెస్‌లతో ఊపు మీదున్న కార్తీక్‌ ఇప్పుడు సీక్వెల్‌ స్టార్‌గా మారుతున్నారు. భూల్‌ బులయ్య ఫస్ట్ పార్ట్‌లో అక్షయ్‌ కుమార్ హీరోగా నటించారు. కానీ సీక్వెల్‌ కోసం అక్షయ్‌ను పక్కన పెట్టి కార్తీక్‌ను సెలెక్ట్ చేసుకున్నారు నార్త్ మేకర్స్‌. ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ కావటంతో… గతంలో అక్షయ్‌ కుమార్ చేసిన సినిమాల సీక్వెల్స్ విషయంలో కార్తీక్ వైపే చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

అక్షయ్‌ కుమార్, సునీల్‌ శెట్టి, పరేష్ రావల్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ హెరా ఫెరీ. ఆల్రెడీ రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమాకు థర్డ్ ఇన్‌స్టాల్మెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌. అయితే తొలి రెండు భాగాల్లో అక్షయ్‌ కుమార్ చేసిన క్యారెక్టర్‌ను నెక్ట్స్ సీక్వెల్‌లో కార్తీక్ ఆర్యన్ చేయబోతున్నారు. మరో సూపర్ హిట్ ఫ్రాంచైజీ వెల్‌కం సిరీస్‌లోనూ అక్షయ్‌ ప్లేస్‌లో కార్తీక్ ఆర్యన్‌ను కన్సిడర్‌ చేస్తున్నారట మేకర్స్‌. ఇలా వరుస సీక్వెల్ న్యూస్ వైరల్ అవుతుండటంతో క్రేజీ మీమ్‌ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజెన్స్‌. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌ నెక్ట్స్ మూవీలోనే కార్తీక్‌ ఆర్యనే హీరోగా నటిస్తున్నారన్న వార్తను ట్రెండ్ చేస్తున్నారు.

ఈ ట్రెండ్స్‌పై కార్తీక్‌ ఆర్యన్ కూడా స్పందించారు. ఈ మీమ్స్ చూసి తాను నవ్వుకుంటున్నా అన్నారు. అవన్నీ రూమర్స్‌ అన్నట్టుగా కొట్టి పారేసినా… నెక్ట్స్ ఏ ఏ సినిమాల్లో నటిస్తున్నారన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు ఈ యంగ్ హీరో.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.