Tollywood: తెలుగునాట డబుల్ హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న తోపు హీరోలు ఈ ముగ్గురే.. మీరేమైనా గెస్ చేయగలరా..?
వరుసగా 3 సినిమాలు హిట్ చేసుకుని హ్యాట్రిక్ కొట్టడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఏకంగా డబుల్ హ్యాట్రిక్ అందుకున్న హీరోలు ప్రజంట్ తెలుగునాట ముగ్గురే ఉన్నారు. వారెవరో తెలుసుకుందాం పదండి.
ఒకటి రెండు కాదు… ఏకంగా ఆరు సినిమాలు హిట్ సౌండ్ చేయటం అంటే మామూలు విషయం కాదు. కథ ఎంపిక దగ్గర నుంచి రిలీజ్ సీజన్ వర్క్ ప్రతీ సారి పర్ఫెక్ట్‌గా సెట్ అయితేనే ఇలాంటి ఫీట్స్ సాధ్యమవుతాయి. ఇంత టఫ్ టాస్క్‌ను చాలా ఈజీగా రీచ్ అయ్యారు ఓ టాలీవుడ్ యంగ్ హీరో. లేటెస్ట్‌గా హిట్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు మల్టీ టాలెంటెడ్ స్టార్ అడివి శేష్. డిఫరెంట్ సినిమాలతో అభిమానులను అలరిస్తున్న శేష్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవటమే కాదు.. వరుస సూపర్ హిట్స్‌తో కమర్షియల్ స్పేస్‌లోనూ సత్తాచాటుతున్నారు. తన సక్సెస్ జర్నీని తానే డిజైన్ చేసుకున్నారు శేష్. వరుస ఫెయిల్యూర్స్ ఎదురుకావటంతో తన కోసం తానే ఓ థ్రిల్లర్ కథను సిద్ధం చేసుకున్నారు. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే క్షణం. ఈ సినిమాతో నటుడిగానే కాదు రచయితగానూ అందరి దృష్టినీ ఆకర్షించారు ఈ మల్టీ టాలెంటెడ్ హీరో.
కామెడీ జానర్‌లో చేసిన అమీ తుమీ కూడా సక్సెస్ సినిమాల సరసన నిలిచింది. కానీ ఆ తరువాతే శేష్ సినిమా జర్నీలో అసలు టర్న్ వచ్చింది. గూడాఛారి… తెలుగు తెర మీద స్పై జానర్ సినిమాలకు బూస్ట్ ఇచ్చిన సినిమా. తానే స్వయంగా రెడీ చేసుకున్న కథా స్క్రీన్‌ప్లేతో మరోసారి మ్యాజిక్ చేశారు అడివి శేష్. ఈ సక్సెస్ ఆయన్ను మినిమం గ్యారెంటీ హీరోగా మార్చేసింది. గూడఛారి సక్సెస్ తరువాత సస్పెన్స్ థ్రిల్లర్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు అడివి శేష్. తాను కూడా అలాంటి కథలనే సెలెక్ట్ చేసుకోవటం మొదలు పెట్టారు. అలా ఆడియన్స్ ముందుకు వచ్చిందే ఎవరు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో రూపొందించిన ఎవరు.. శేష్ క్యాప్‌లో మరో సక్సెస్ ఫెదర్‌గా యాడ్ అయ్యింది.
రీసెంట్‌గా మేజర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అందుకున్నారు అడివి శేష్. తనను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ లెవల్‌లో సూపర్ హిట్ అయ్యింది. ఇదే ట్రెండ్‌ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు హిట్ 2తోనూ మరో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకునేందుకు దూసుకుపోతున్నారు. ఇలా వరుసగా ఆరు సూపర్ హిట్స్‌తో రీసెంట్ టైమ్స్‌లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన అతి కొద్ది మంది హీరోల సరసన నిలిచారు అడివి శేష్.
తారక్ – నాని ఖాతాలో కూడా ఈ అరుదైన రికార్డ్
ఈ మధ్య కాలంలో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన స్టార్స్ ఎవరంటే ఒకరిద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. టాప్ స్టార్స్… కమర్షియల్ హీరోలు కూడా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నారు. అందుకే డబుట్ హ్యాట్రిక్ ఇచ్చిన హీరోల గురించి స్పెషల్‌గా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
హిట్ హీరోనే కాదు హిట్ నిర్మాత కూడా డబుల్ హ్యాట్రిక్ స్టారే. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న టైమ్‌లో నాగ్ అశ్విన్‌కు దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చే సాహసం చేశారు నాని. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎవడే సుబ్రమణ్యం సినిమా సూపర్ హిట్ కావటమే కాదు. నేచురల్ స్టార్‌గా నాని ఇమేజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఆ తరువాత కామెడీ మూవీ భలే భలే మొగాడివోయ్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కృష్ణగాడి వీర ప్రేమగాథ, సస్పెన్స్ థ్రిల్లర్ జెంటిల్‌మెన్ సినిమాలతోనూ వరుస విజయాలు అందుకున్నారు నాని. ఒక్కో సినిమా ఒక్కో డిఫరెంట్ జానర్ కావటంతో నటుడిగానూ నాని రేంజ్ మారిపోయింది. ఫస్ట్ హ్యాట్రిక్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేసిన నాని.. సెకండ్ హ్యాట్రిక్ కోసం ఒకే జానర్‌కు ఫిక్స్ అయ్యారు. తనకు బాగా పట్టున్న రొమాంటిక్ జానర్‌లో మజ్ను, నేను లోకల్, నిన్నుకోరి లాంటి సినిమాలు చేశారు. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అవ్వటంతో డబుల్ హ్యాట్రిక్ స్టార్ అయ్యారు నాని.
టాప్ హీరోస్‌లో డబుల్ హ్యాట్రిక్ ఫీట్ సాధించిన స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. 2015కు ముందు ఒక హిట్టూ.. రెండు ఫ్లాపులు అన్నట్టుగా సాగిన తారక్ కెరీర్ ఆ తరువాత సక్సెస్ టర్న్ తీసుకుంది. టెంపర్ సినిమాతో వరుస బ్లాక్ బస్టర్స్‌కు టైటిల్ కార్డ్ వేశారు జూనియర్. ఆ తరువాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు కూడా సూపర్ హిట్ కావటంతో హ్యాట్రిక్ హిట్స్ జూనియర్ ఖాతాలో చేరాయి. కానీ ఈ సక్సెస్ జర్నీ అక్కడితో ఆగిపోలేదు. ఆ తరువాత కూడా జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ట్రిపులార్ సినిమాలు సూపర్ హిట్ కావటంతో తన లీగ్‌లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన వన్ అండ్ ఓన్లీ స్టార్‌గా నిలిచారు తారక్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.