AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan: టాలీవుడ్ స్టార్ కోసం బాలీవుడ్ హీరో.. మరో సౌత్ సినిమాలో విలన్‏గా సైఫ్ అలీ ఖాన్.. ఏ హీరో కోసమంటే..

ఇక ఇప్పుడు మరో హీరో రాబోతున్నారు. అయితే హీరోగా కాకుండా ప్రతినాయకుడిగా దక్షిణాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అతనే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్.

Saif Ali Khan: టాలీవుడ్ స్టార్ కోసం బాలీవుడ్ హీరో.. మరో సౌత్ సినిమాలో విలన్‏గా సైఫ్ అలీ ఖాన్.. ఏ హీరో కోసమంటే..
Saif Ali Khan
Rajitha Chanti
|

Updated on: Dec 05, 2022 | 9:44 AM

Share

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాల హావా కొనసాగుతుంది. బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక ఇటీవల పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతారా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లు రాబట్టాయి. దీంతో ఇప్పుడు బీటౌన్ హీరోస్ ఫోకస్ సౌత్ పై పడిందనే చెప్పుకోవాలి. దక్షిణాది చిత్రాల్లో నటించేందుకు.. తమ సినిమాలను ఇక్కడ విడుదల చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లాల్ సింగ్ చద్దా సినిమాతో అమీర్ ఖాన్ … బ్రహ్మాస్త్ర మూవీతో రణబీర్ సౌత్ ఆడియన్స్ కు పరిచయం కాగా.. ఇటీవల బేధియా చిత్రంతో వరుణ్ ధావన్ దక్షిణాది బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఇక ఇప్పుడు మరో హీరో రాబోతున్నారు. అయితే హీరోగా కాకుండా ప్రతినాయకుడిగా దక్షిణాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అతనే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్.

ప్రస్తుతం ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న ఆదిపురుష్ సినిమాలో సైఫ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ రావణుడిగా కనిపించనున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఇక లేటేస్ట్ టాక్ ప్రకారం సైఫ్ మరో సౌత్ సినిమాలో నటించనున్నారట. త్రివిక్రమ్.. మహేష్ కాంబోలో రాబోతున్న సినిమాలో సైఫ్ విలన్ గా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ముందుగా ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకున్నారని రూమర్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు అనుహ్యాంగా సైఫ్ పేరు తెరపైకి వచ్చింది. ఇందులో సైఫ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్నారు. పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
ఆ 12 సినిమాలు చిరంజీవిని హీరోగా నిలబెట్టాయి..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
Horoscope Today: వారి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం..
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..