శృతిమించుతున్న ప్రాంక్‌లు.. ప్రాంక్‌స్టర్స్‌ను వదిలే ప్రసక్తే లేదంటున్న కరాటే కళ్యాణి

శృతిమించుతున్న ప్రాంక్‌లు.. ప్రాంక్‌స్టర్స్‌ను వదిలే ప్రసక్తే లేదంటున్న కరాటే కళ్యాణి
Karate Kalyani Srikanth Red

నటి కరాటే కల్యాణి వర్సెస్ యూట్యూబర్ శ్రీకాంత్‌ రెడ్డి.. గత 24 గంటలుగా ఈ ఎపిసోడ్ రచ్చ రచ్చ అవుతోంది. ప్రాంక్‌ వీడియోల ముసుగులో అశ్లీలాన్ని అప్‌లోడ్‌ చేస్తున్నాడంటూ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టేశారు కరాటే కల్యాణి.

Rajeev Rayala

|

May 13, 2022 | 7:02 PM

నటి కరాటే కల్యాణి వర్సెస్ యూట్యూబర్ శ్రీకాంత్‌ రెడ్డి.. గత 24 గంటలుగా ఈ ఎపిసోడ్ రచ్చ రచ్చ అవుతోంది. ప్రాంక్‌ వీడియోల ముసుగులో అశ్లీలాన్ని అప్‌లోడ్‌ చేస్తున్నాడంటూ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టేశారు కరాటే కల్యాణి. ప్రశ్నించినందుకే అతడు కొట్టాడని, ఆ తర్వాత అతణ్ణి కొట్టాల్సి వచ్చిందని కరాటే కల్యాణి చెబుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌ దాకా వెళ్లింది. ఆమే నన్ను బ్లాక్‌మెయిల్ చేసింది.. నన్ను డబ్బు అడిగింది అంటూ రివర్స్ అయ్యారు యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డి. అయినా నేను చేసిన తప్పేంటి అంటూ రివర్స్ అవుతున్నారు. సినిమాల్లో చూపించినప్పుడు లేని అభ్యంతరం నేను చూపిస్తే ఎందుకొస్తుందని అంటూ ఫాలోయర్ల నుంచి సపోర్ట్‌ అడుగుతున్నారు.

కరాటే కల్యాణి మాత్రం ఇటువంటి పనికిమాలిన ప్రాంక్‌స్టర్లను వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు. యూత్‌ని చెడగొట్టే సోషల్ మీడియా పురుగుల్ని ఏరిపారేస్తానని, లీగల్‌గా పైట్ చేస్తానని, ఎందాకైనా వెళతానని హెచ్చరిస్తున్నారు కరాటే కల్యాణి. ఆమెకు మహిళా సంఘాల నేతల మద్దతు కూడా లభిస్తోంది. రిసెంట్‌గా సినిమా ప్రమోషన్‌లో కూడా ప్రాంక్ వీడియోల ఒక పార్ట్ అయ్యాయి. తమ సినిమాల్ని జనంలోకి తీసుకెళ్లడానికి ప్రాంక్ వీడియోలు చేసి అభాసుపాలైన వాళ్లూ ఉన్నారు. సినిమా నటులతో పాటు, టీవీ సీరియల్ యాక్టర్స్‌ కూడా ప్రాంక్ వీడియోలతో పబ్లిసిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. వీటికి పరిమితి ఉంటే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రాంక్‌ వీడియోల పేరుతో బూతు పదార్థాన్ని స్ప్రెడ్ చేయడంపై అన్ని కార్నర్స్‌ నుంచి నిరసన వ్యక్తమవుతోంది. జస్ట్ ఫర్ ఫన్ అంటూ మొదలైన ప్రాంక్ వీడియోల పిచ్చి.. అదుపు తప్పిందని, నెట్లో వీటికి ఫైర్‌వాల్స్ ఉండాలని సూచిస్తున్నారు. ఈ ప్రాంక్‌ మేనియాకు ముఖ్యంగా స్టూడెంట్ ఏజ్ గ్రూప్‌ ఎఫెక్ట్ అవుతుందన్నది యూనివర్సల్ ఒపీనియన్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Bhala Thandhanana: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. భళ తందనాన స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Anasuya Bharadwaj: ఖతర్నాక్ ఫోజులతో కవ్విస్తున్న అను.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu