Sarkaru Vaari Paata: రచ్చలేపిన రాప్ సాంగ్.. సర్కారు వారి పాట నుంచి మరో సాంగ్..

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట దూసుకుపోతుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నిన్న (12న ) పేక్షకుల ముందుకు వచ్చింది.

Sarkaru Vaari Paata: రచ్చలేపిన రాప్ సాంగ్.. సర్కారు వారి పాట నుంచి మరో సాంగ్..
Follow us

|

Updated on: May 13, 2022 | 7:29 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata)దూసుకుపోతుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నిన్న (12న ) పేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. మాస్ మాస్ యాక్టింగ్ తో అదరగొట్టారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మహేష్ నుంచి వచ్చిన ఈ సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తర్వాత ఆ అంచనాలను సర్కారు వారి పాట సినిమా రీచ్ అయ్యిందనే చెప్పాలి. సర్కారు వారి పాట చిత్రాన్ని చూసేందుకు అభిమానులే కాకుండా.. సామన్య ప్రేక్షకుల సైతం బ్రహ్మరథం పట్టారు. విడుదలైన ఒక్కరోజులోనే బాక్సాఫీస్ వద్ద భారీ బిజినెస్ చేస్తోంది. ఈ సినిమా ఇండియన్ మార్కెట్‏లోనే కాకుండా.. ఓవర్సీస్‏లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది.

తాజాగా ఈ సినిమానుంచి రాప్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సర్కారు వారి వేట.. పవర్ ఫుల్ మాట.. రివర్స్ లేని బాట.. అంటూ సాగే పవర్ ఫుల్ పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పాట సినిమాలో చిన్న బిట్ గా వస్తుంది. ఇప్పుడు ఈ పాట ఫుల్ సాంగ్ రావడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. మహా ఈ రాప్ సాంగ్ రాయగా.. మహా , శ్రావణ భార్గవి కలిసి ఆలపించారు. ఇప్పుడు ఈ పాట ఉర్రుతలూగిస్తుంది. ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. మహేష్ బాబు స్టైల్ కు.. డైలాగ్ డెలివరీకి.. నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పోకిరి సినిమా తర్వాత మహేష్ మాస్ పాత్రలో నటించడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Hebah Patel: క్లాస్ లుక్ లో హెబ్బా పటేల్.. చూడముచ్చటగా ఉందంటున్న ఫ్యాన్స్

Bhala Thandhanana: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. భళ తందనాన స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Anasuya Bharadwaj: ఖతర్నాక్ ఫోజులతో కవ్విస్తున్న అను.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్