Kantara Movie: నా సినిమాలకు మద్దతు ఇవ్వండి.. అభిమానులను రిక్వెస్ట్ చేసిన రిషబ్ శెట్టి

కాంతార సినిమా సక్సెస్ అవ్వడంతో పాటు అనేక అవార్డులు కూడా అందుకుంది. ఇక ఇప్పుడు కాంతార 2 కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ కథను కూడా సిద్ధం చేస్తున్నారు.

Kantara Movie: నా సినిమాలకు మద్దతు ఇవ్వండి.. అభిమానులను రిక్వెస్ట్ చేసిన రిషబ్ శెట్టి
Rishab Shetty
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 02, 2023 | 5:31 PM

కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కన్నడ లో విజయం సాధించిన ఈ సినిమాను అన్ని భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించారు. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో భారీ విజయం అందుకుంది. కాంతార సినిమా సక్సెస్ అవ్వడంతో పాటు అనేక అవార్డులు కూడా అందుకుంది. ఇక ఇప్పుడు కాంతార 2 కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే రిషబ్ శెట్టి కాంతారా సీక్వెల్ కథను కూడా సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమానుంచి అప్డేట్ రానుంది. ఇక ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రిషబ్ శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

రిషబ్ శెట్టి రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీని పై స్పందించారు రిషబ్ శెట్టి. సోషల్ మీడియా వేదికగా తాను రాజకీయాల్లోకి వస్తారన్న వార్తల పై క్లారిటీ ఇచ్చారు. అలాగే తన సినిమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.

తాను రాజకీయాల్లోకి రావడం లేదని తెలిపారు. తనకు అలాంటి ఆలోచనలు కూడా లేవని అన్నారు. తన సినిమాలను ఆదరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు రిషబ్ శెట్టి. సోషల్ మీడియాలో ఓ అభిమాని మీరు రాజకీయాల్లోకి వస్తే నేను మద్దతు ఇస్తానని అన్నాడు. దానికి రిషబ్ స్పందిస్తూ.. నేను రాజకీయాల్లోకి రాను.. నా సినిమాలకు మద్దతు ఇవ్వండి చాలు అంటూ విజ్ఞప్తి చేశారు రిషబ్.