Balakrishna: బాలయ్య సినిమానా మజాకా..! భారీ ధరకు ఎన్బీకే 108 డిజిటల్ రైట్స్
బోయపాటి శ్రీనుతో కలిసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు బాలయ్య. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ జోష్ మీదున్నారు. అఖండ సినిమాతో సంచలన విజయం అందుకున్నారు బాలయ్య. బోయపాటి శ్రీనుతో కలిసి హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు బాలయ్య. ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కాజల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఎన్బీకే 108 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్ 90’s బాలయ్యను మరోసారి గుర్తుచేసిందంటూ కామెంట్స్ చేశారు ఫ్యాన్స్.
ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా అక్టోబర్ లో ప్రేక్షకులముందుకు రానుంది. ఇక బాలకృష్ణ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. బాలయ్య గత సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడంతో ఇప్పుడు ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ బాలయ్య సినిమాను ఏకంగాని 36 కోట్లు ఇచ్చి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తున్నాయి. ఈ మూవీని 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో కాలేజ్ టీచర్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. అలాగే శ్రీలీల బాలకృష్ణ కూతురి పాత్రలో కనిపించనుందట.