Vijayashanti: కొడుకు ఉన్నాడంటూ వస్తున్న వార్తల పై స్పందించిన విజయ శాంతి.. ఏమన్నారంటే

హీరోలకు సమానంగా యాక్షన్ సీన్ చేస్తూ అలరించారు విజయశాంతి. ఇక రాజకీయాల్లో తనదైన శైలిలో గళం వినిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు విజయశాంతి. ఇక మొన్నామధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

Vijayashanti: కొడుకు ఉన్నాడంటూ వస్తున్న వార్తల పై స్పందించిన విజయ శాంతి.. ఏమన్నారంటే
Vijayashanthi
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 02, 2023 | 4:31 PM

సీనియర్ హీరోయిన్ విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించారు. కమర్షియల్ హీరోలతో సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ హీరోయిన్ గా సినిమాలు చేసి అలరించారు విజయశాంతి. హీరోలకు సమానంగా యాక్షన్ సీన్ చేస్తూ అలరించారు విజయశాంతి. ఇక రాజకీయాల్లో తనదైన శైలిలో గళం వినిపిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు విజయశాంతి. ఇక మొన్నామధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇండ్ల ఉంటే ఇప్పుడు విజయశాంతికి 25 ఏళ్ల వయసున్న కొడుకు ఉన్నాడని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

విజయశాంతికి 22 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. హీరోయిన్ గా దాదాపు అదరు హీరోలతో కలిసి నటించింది విజయశాంతి. అయితే తాజాగా తనకు 25 ఏళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు అనే వార్తల పై స్పందించారు విజయశాంతి.

నాకు పిల్లలు లేరన్న విషయం దాదాపు అందరికి తెలిసిందే. నేను పెళ్లి చేసుకున్న తర్వాత సమాజానికి సేవచేయడం కోసం పిల్లను కనకూడదని అనుకున్నాం. ప్రస్తుతం నేను రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. అలాగే మంచి పాత్రలు వస్తే సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా అన్నారు విజయశాంతి.