Jolly Bastian: ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూసిన చిరంజీవి ‘అన్నయ్య’ ఫైట్‌ మాస్టర్‌

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ జాలీ బాస్టియన్ (57) హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం (డిసెంబర్‌ 26) బెంగళూరులోని తన నివాసంలో నిద్రలోనే కార్డియాక్‌ అరెస్ట్‌తో తుది శ్వాస విడిచారాయన. కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సుమారు 900కు పైగా సినిమాలకు ఫైట్‌ మాస్టర్‌గా పనిచేశారు జాలి బాస్టియన్‌.

Jolly Bastian: ఇండస్ట్రీలో మరో విషాదం.. గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూసిన చిరంజీవి 'అన్నయ్య' ఫైట్‌ మాస్టర్‌
Jolly Bastian
Follow us

|

Updated on: Dec 27, 2023 | 4:48 PM

ఇటీవ‌ల సినిమా పరిశ్రమకు షాకుల మీద షాకులు తగుతులున్నాయి. వివిధ కారణాలతో పలువురు సినీ సెలబ్రిటీలు కన్నుమూస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా గెండుపోటుతో చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ ఫైట్‌ మాస్టర్‌ జాలీ బాస్టియన్ (57) హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. మంగళవారం (డిసెంబర్‌ 26) బెంగళూరులోని తన నివాసంలో నిద్రలోనే కార్డియాక్‌ అరెస్ట్‌తో తుది శ్వాస విడిచారాయన. కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో సుమారు 900కు పైగా సినిమాలకు ఫైట్‌ మాస్టర్‌గా పనిచేశారు జాలి బాస్టియన్‌. తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాకు స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. అలాగే కృష్ణవంశీ నక్షత్రం మూవీకి కూడా వర్క్‌ చేశారు. బాస్టియన్‌ హఠాన్మరణంతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఫైట్‌ మాస్టర్‌ మృతికి నివాళి అర్పిస్తున్నారు. అలాగే జాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

బైక్ మెకానిక్ టు ఫైట్ మాస్టర్..

జాలీ 1966లో కేరళలోని అలెప్పిలో జన్మించాడు. కానీ బెంగళూరులో పెరిగాడు. అక్కడే విద్యాభ్యాసం చేశారు. జాలీ బాస్టిన్ బైక్ మెకానిక్‌గా కెరీర్ ప్రారంభించాడు. అతడి ప్రతిభను గుర్తించిన కొందరు స్టంట్‌మ్యాన్‌గా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. స్టంట్ ఆర్టిస్ట్‌గా, స్టంట్ డైరెక్టర్‌గా ఇప్పటివరకు 900కు పైగా సినిమాలకు పనిచేశారు జాలీ. ‘నినంగాగి కదిరువే’ సినిమాతో దర్శకుడిగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకున్న ఫైట్‌ మాస్టర్‌గా జాలీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సినిమాల్లో భాగంగా ప్రమాదకర విన్యాసాలు చేస్తూ చాలా సార్లు గాయపడ్డాడు బాస్టియన్‌. ‘భలే చతుర’ సినిమాలో బాంబు పేలుడు సన్నివేశంలో జాలీ శరీరం చాలా వరకు దెబ్బతింది. అలాగే’పుట్నంజా’ సినిమా షూటింగ్‌లో బైక్‌పై నుంచి కిందపడి ముఖం, కాలుకు గాయాలయ్యాయి.

ఇవి కూడా చదవండి

900కు పైగా సినిమాలు..

ఇవాళ అంత్యక్రియలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
నువ్వు ఎవడైతే నాకేంటి..!! టూరిస్ట్‌లకు సుస్సు పోయించిన గజరాజు..
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
ఈ పంటను సాగు చేస్తే ధనవంతులు అవుతారు? అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!
చెన్నైపైనే బెంగళూరు ఆశలు.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
చెన్నైపైనే బెంగళూరు ఆశలు.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాల్సిందే..
హోటల్‌లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా...
హోటల్‌లో దోశ తింటుంటే పంటికి ఏదో తగిలింది.. ఏంటా అని చూడగా...
మల్లన్నకు కానుకల వెల్లువ.. రూ.2.81 కోట్ల హుండీ ఆదాయం
మల్లన్నకు కానుకల వెల్లువ.. రూ.2.81 కోట్ల హుండీ ఆదాయం
ఎంజాయ్ పండగో..! ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..
ఎంజాయ్ పండగో..! ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు..
మీరు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తున్నారా? ఇవిగో కొత్త నిబంధనలు!
మీరు గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేస్తున్నారా? ఇవిగో కొత్త నిబంధనలు!
ఇలా చేస్తే చర్మ సౌందర్యం మీ సొంతం.. అద్భుతమైన చిట్కా..
ఇలా చేస్తే చర్మ సౌందర్యం మీ సొంతం.. అద్భుతమైన చిట్కా..
యాప్‌లో ఫోటోను అప్‌లోడ్ చేయండి.. చిత్రం ఉన్న కేక్‌ను పొందండి
యాప్‌లో ఫోటోను అప్‌లోడ్ చేయండి.. చిత్రం ఉన్న కేక్‌ను పొందండి
సెంచరీ మిస్సయినా... ప్రపంచ రికార్డ్ సృష్టించిన కోహ్లీ..
సెంచరీ మిస్సయినా... ప్రపంచ రికార్డ్ సృష్టించిన కోహ్లీ..