తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ హీరో న్యాచులర్ స్టార్ నాని. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నాని.. ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ డ్రామాగా ఈ మూవీ రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈచిత్రంలో తొలిసారిగా మృణాల్, నాని కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నాని. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. హాయ్ నాన్న రిలీజ్ తర్వాత వివేక్, నాని కాంబోలో రాబోయే సినిమా పట్టాలెక్కనుంది. అయితే ఈ సినిమాలో నటించే నటీనటులు ఎవరనే విషయాలు.. సాంకేతిక నిపుణులకు సంబంధించిన విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూ్స్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాలో నానితోపాటు మరో హీరో నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆ హీరో సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లుగా టాక్. త్వరలోనే ఈ మూవీ అనౌన్స్మెంట్ తోపాటు.. సినిమా నుంచి మరిన్న క్రేజీ అప్డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారు. అతడే కన్నడ యంగ్ హీరో దీక్షిత్ శెట్టి. గతంలో నాని నటించిన దసరా సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఈ చిత్రంలో వీరిద్దరి స్నేహం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే.. వివేక్ ఆత్రేయ, నాని కాంబోలో గతంలో అంటే సుందరానికీ సినిమా వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ స్టోరీ పరంగా అడియన్స్ నుంచి మంచి మార్కులే వచ్చినప్పటికీ కమర్షియల్ హిట్ కాలేదు. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి జోడి రిపీట్ కానుంది. నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తివివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.