AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంగనా రనౌత్ నవరాత్రి శుభాకాంక్షలు, కాస్త స్పెషల్‌గా

నవరాత్రి పవిత్ర ఉత్సవం ప్రారంభం కావడంతో నటి కంగనా రనౌత్ శనివారం తన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ  తమలోని శక్తి వ్యవస్థను మెరుగుపర్చడానికి పని చేయమని విజ్ఞప్తి చేస్తూ....

కంగనా రనౌత్  నవరాత్రి శుభాకాంక్షలు, కాస్త స్పెషల్‌గా
Ram Naramaneni
|

Updated on: Oct 17, 2020 | 8:27 PM

Share

నవరాత్రి పవిత్ర ఉత్సవం ప్రారంభం కావడంతో నటి కంగనా రనౌత్ శనివారం తన శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ  తమలోని శక్తి వ్యవస్థను మెరుగుపర్చడానికి పని చేయమని విజ్ఞప్తి చేస్తూ, ఆమె అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్న పాత చిత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. నవరాత్రి పండుగ ప్రతి ఒక్కరికీ గొప్ప అవకాశాలను ఎలా తెచ్చిపెడుతుందో ఆమె రాసుకొచ్చారు. శరదృతువులో వచ్చే ఈ నవరాత్ర వేడుకల్లో తొమ్మిది రూపాలను ఆరాధిస్తారని పేర్కొంది. ఎంతో సరదా నిండిన ఈ పండుగను దేశవ్యాప్తంగా వివిధ రకాలుగా జరుపుకుంటారని తెలిపింది.

తొమ్మిది రోజులలో, భక్తులు దుర్గాదేవికి భక్తిశ్రద్దలతో ప్రార్థనలు చేస్తారు. ఉపవాసాలు ఉంటారు. శరద్ నవరాత్రి అని కూడా పిలువబడే ఈ సందర్భం దుర్గాదేవి మహిషాసుర అనే రాక్షసుడిపై సాధించిన విజయానికి గుర్తుగా భావిస్తారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం. శరద్ నవరాత్రి 10 వ రోజును దసరా లేదా విజయ దశమిగా జరుపుకుంటారు.